Chiranjeevi :బ్రేక్ తీసుకుని వెకేషన్ కోసం విదేశాలకు వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించకుండానే వెళ్లిపోయారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా, చిరంజీవి కేవలం “నేను చెప్పాల్సింది చెప్పాను” అంటూ ముందుకు కదిలారు. నిజానికి, బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి మొన్ననే ఒక లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆ లేఖ ద్వారానే తాను చెప్పదలచుకున్న విషయాన్ని ఇప్పటికే స్పష్టం చేశానని…