ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. ఆ గడువు సమీపించే కొద్దీ టీడీపీ ఏదోక కార్యక్రమం చేపడుతూనే ఉంది. ఏదైనా సంఘటనలు జరిగితే బాధిత కుటుంబాన్ని పలకరించేందుకు బృందంగా వెళ్లడం ద్వారా పొలిటికల్ మైలేజ్ పొందే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో పోలీసుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది టీడీపీ నేతలకు. హౌస్ అరెస్టులు చేస్తుండటంతో నాయకులు బయటకు వెళ్లలేని పరిస్థితి. ఫలితంగా ముందుగా అనుకున్న కార్యక్రమం సక్సెస్ కావడం లేదనే భావనలో ఉందట టీడీపీ. ఆ…
చింతమనేని ప్రభాకర్. దెందులూరు మాజీ ఎమ్మెల్యే. ప్రభాకర్ ఎక్కడుంటే అక్కడ వివాదం అన్నట్టు రాజకీయాలు మారిపోయాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆయన దూకుడే ఆ ప్రచారాన్ని తీసుకొచ్చింది. ప్రస్తుతం అధికార బలం లేకపోయినా అనుచరగణం వెంటే ఉంది. ఈ క్రమంలో చేసిన పనుల వల్ల వరసగా కేసుల్లో కూరుకుపోయారు చింతమనేని. అధికారంలో ఉన్నప్పుడు.. గత ఎన్నికల టైమ్‌లో వైసీపీపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ రాజకీయంగా కాకరేపుతున్నాయి. కేసులంటే భయపడని చింతమనేని.. తాజాగా కొత్తదారి ఎంచుకోవడంతో చర్చగా…
టీడీపీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను వైసీపీ ప్రభుత్వం హత్య చేసేందుకు ప్రయత్నిస్తోందని చింతమనేని ప్రభాకర్ తీవ్ర ఆరోపణలు చేశారు. తనను హతమార్చేందుకు ఇప్పటికే రెండు సార్లు ఎన్‌కౌంటర్ చేసేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. 2019లో ఒకసారి, 2021లో మరోసారి ఎన్ కౌంటర్ చేసేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు ఆయన వివరించారు. సకాలంలో టీడీపీ నాయకులు స్పందించకుంటే తాను ఎప్పుడో చనిపోయేవాడినని చింతమనేని ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. Three Gorges…
మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. నన్ను అంతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.. ఓ కేసు విషయంలో ఏలూరు జిల్లా కోర్టులో సీఎం వైఎస్ జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రైవట్ కేసు ఫైల్ చేసిన ఆయన… ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తన భద్రతకు ముప్పు వాటిల్లేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. అధికార పార్టీ ఆరాచకాలపై కేంద్ర…
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానంలో ఊరట లభించింది.. 2011లో చింతమనేనిపై నమోదైన కేసును కొట్టివేసింది ప్రజా ప్రతినిధుల కోర్టు.. మహిళపై దాడి చేశారంటూ 2011లో చింతమనేని ప్రభాకర్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే కాగా.. అయితే, అక్రమంగా కేసు నమోదు చేశారని చింతమనేని తరపు న్యాయవాదులు కోర్టు ముందు వాదనలు వినిపించారు.. ఇక, ఈ కేసులో సరైన సాక్ష్యాలు లేకపోవడంతో కేసును కొట్టివేసింది ప్రజా ప్రతినిధుల…
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌కు హైకోర్టులో ఊరట లభించింది. తదుపరి చర్యలపై కోర్టు స్టే విధించింది. వారం క్రితం చింతపూడిలో ‘బాదుడే బాదుడు’ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు, ఓ గొడవ చోటు చేసుకుంది. ఆ సందర్భంగా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. దీంతో కోర్టుని ఆశ్రయించిన ప్రభాకర్, ఎస్టీ – ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టేలా తాను ఎటువంటి చర్యలకు పాల్పడలేదన్నారు. వాదనలు విన్న కోర్టు, కేసులో తదుపరి చర్యలపై…
ఏపీలో పెంచిన ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నేతలు నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ శనివారం నాడు ఏలూరు జాతీయ రహదారిపై వినూత్నంగా నిరసన చేపట్టారు. బస్సుల్లో వెళ్తున్న ప్రయాణికులకు ఒక్కొక్కరికి రూ.20 నోటుతో పాటు ఓ మజ్జిగ ప్యాకెట్ అందించారు. పెంచిన ఛార్జీలను ప్రయాణికులు భరించలేకపోతున్నారని చెప్పేందుకు రూ.20 ఇచ్చినట్లు చింతమనేని ప్రభాకర్ తెలిపారు. మరోవైపు ఉగాది సందర్భంగా విద్యుత్ ఛార్జీలను…
ఏపీ ప్రభుత్వం ఇటీవల వన్ టైం సెటిల్‌మెంట్ (ఓటీఎస్) పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ ఓటీఎస్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసనలు చేస్తున్నాయి. అయితే తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు ఓటీఆఎస్‌ను రద్దు చేయాలంటూ కలేక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ.. అన్ని వర్గాల వారిని జగన్ దోపిడీ చేస్తున్నాడని ఆయన అన్నారు.…
రోజురోజుకు ఏపీలో రాజకీయాలు ముదురుతున్నాయి. ఇప్పటికే టీడీపీ, వైసీపీ నాయకులకు మధ్య మాటల యుద్ధ తారస్థాయి చేరింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘చంద్రబాబుది కొంగ జపం అంటున్న మంత్రి పేర్ని నానికి పచ్చ కామెర్లు వచ్చాయి. చంద్రబాబును విమర్శిస్తున్న పేర్ని నాని ఎలా మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదు. జగన్‌ది బలుపు కాదు వాపు. స్థానిక ఎన్నికలకు ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తే ముచ్చెమటలు పట్టిస్తాం. ఇప్పుడు ఎన్నికలు పెడితే…