ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి, మరో ప్రోటోకాల్ పోస్ట్‌లో ఉన్న నాయకుడికి మధ్య ఒకరకంగా యుద్ధమే జరుగుతోందా? పాత కొత్త వైరం ముదురు పాకాన పడిందా? ఇద్దరి వర్గపోరులో పార్టీ పెద్దలు సైతం తలబాదుకోవాల్సి వస్తోందా? ఏకంగా రాష్ట్ర మంత్రి ముందే రచ్చ చేసుకున్న ఆ ఇద్దరు ఎవరు? ఏదా అసెంబ్లీ నియోజకవర్గం? వనపర్తి కాంగ్రెస్ వార్ పీక్స్ చేరుతోందట. నియోజకవర్గంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి మధ్య పంచాయతీ ఓ రేంజ్‌లో…
విద్యార్థులు నిరుద్యోగులు ఆందోళన చేయవద్దని రాష్ట్ర ప్రణాళిక సంఘం చైర్మన్ చిన్నారెడ్డి సూచించారు. 20 వేల డీఎస్సీ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. మొదటి విడుదల 11 వేల డీఎస్సీ పోస్టులు వేసామని, మరో ఆరు నెలల్లో మిగిలిన పోస్టులకు భర్తీకి డీఎస్సీ వేస్తామని ఆయన వెల్లడించారు. గత 10 ఏళ్లలో నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని, డీఎస్సీ వాయిదా పడకపోవచ్చు అని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలు విన్నందుకు ప్రభుత్వం సిద్ధంగా…
దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగియడంతో పాలనా పరమైన అడ్డంకులు తొలగాయని ప్రజావాణిలో అందిన దరఖాస్తులను వెంటనే పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డా. చిన్నా రెడ్డి తెలిపారు. మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్ లో శుక్రవారం నుండి పునః ప్రారంభమైన ప్రజావాణి కార్యక్రమంలో చిన్నారెడ్డి పాల్గొని దరఖాస్తులను స్వీకరించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు కారణంగా సుమారు 3 నెలల సుదీర్ఘ విరామం తర్వాత మొదలైన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు అధిక…
తెలంగాణ రాష్ట్ర ప్రజా భవన్‌లో ప్రజావాణి కార్యక్రమం తిరిగి ప్రారంభమైంది. ప్రజలు తమ సమస్యలను తెలియజేయడానికి రాష్ట్ర నలుమూలల నుంచి భారీ సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటాన్నారు. రాష్ట్రలో ఎన్నికల కోడ్ ముగియడంతో, ఈ కార్యక్రమం పునఃప్రారంభమైందని ప్రజావాణి ఇంచార్జ్, తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఛైర్మన్ జి. చిన్నారెడ్డి తెలిపారు. ప్రజల అభ్యర్థనలను ఇవాళ అంగీకరిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రతి మంగళవారం మరియు శుక్రవారం ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమవుతుంది అని చెప్ప్పుకొచ్చారు.
కాంగ్రెస్ సభ్యత్వం తీసుకునన్న సభ్యులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తూ న్యూ ఇండియా అస్యూరెన్సు కంపెనీ తో ఒప్పందం చేసుకున్నారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. సభ్యత్వం తీస్కున్న కార్యకర్తలు ప్రమాదంలో మరణం సంభవిస్తే 2 లక్షల రూపాయల పరిహారం అందేలా, ప్రమాదం జరిగి ఏదైనా శరీర అవయవాలు దెబ్బతింటే ప్రమాదం తీవ్రతను బట్టి పరిహారం అందుతుంది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి, పీఏసీ కన్వీనర్ షబ్బీర్…