తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పునఃనిర్మించ తలపెట్టిన యాదాద్రి శ్రీలక్ష్మినరసింహ స్వామి వారి ఆలయ నిర్మాణం పూర్తైంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రి సీఎం కేసీఆర్ ముచ్చింతల్‌లో ఉన్న చినజీయర్ స్వామిని కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మహాకుంభ సంప్రోక్షణ, మహా సుదర్శన యాగం లాంటి ఏర్పాట్లపై చినజీయర్‌తో చర్చించనున్నారు. అంతేకాకుండా రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ ఏర్పాట్లపై కూడా సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. అయితే ఎప్పుడెప్పుడా అని యావత్తు తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్న యాదాద్రి ఆలయం…
ప్రతి ఏడాది కార్తీక మాసంలో భక్తీ టీవీ సారథ్యంలో కోటి దీపోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది కరోనా మహమ్మారి సమయంలోనూ నిబంధనలు పాటిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా హైదరాబాద్‌లోని కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. నవంబర్ 12 నుంచి నవంబర్ 22 వరకు కోటి దీపోత్సవం కార్యక్రమం జరిగింది. Read: టీకా తీసుకుంటేనే సినిమా థియేటర్‌లోకి అనుమతి… మొదటి రోజు నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కోటి…
ఢిల్లీ పర్యటనలో ఉన్న త్రిదండి చిన్న జీయర్ స్వామి.. వరుసగా కేంద్రం పెద్దలను కలుస్తున్నారు.. బుధవారం రోజు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిసి స్టాచ్యు ఆఫ్ ఈక్వాలిటీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రత్యేక అతిధిగా రావాలంటూ ఆహ్వానించిన ఆయన.. ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు.. శంషాబాద్ ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో ఏర్పాటు చేసిన రామానుజ విగ్రహ ప్రారంభోత్సవానికి ఆహ్వానం పలికారు.. ఈ సందర్భంగా గంటకుపైగా అమిత్‌షాతో చర్చలు జరిపారు.. చిన్నజీయర్ తో పాటు…
ఢిల్లీలో పర్యటనలో ఉన్న శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి.. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయును కలిశారు.. 2022 ఫిబ్రవరిలో జరగనున్న సమతా ప్రతిమ (స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ) ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించారు.. మొదట ఉపరాష్ట్రపతిని కలిసిన ఆహ్వానం పలకగా.. వివక్షలను నిర్మూలించి సమానత్వ సాధన కోసం భగవద్రామానుజులు కృషి చేశారని.. అతిపెద్ద ప్రతిమ ఏర్పాటు… ప్రపంచానికి రామానుజుని బోధనలు, సందేశం విస్తరించేందుకు తోడ్పడుతుందని ఆకాక్షించారు వెంకయ్య.. సమాజంలో అంటరానితనాన్ని, వివక్షను…