ముచ్చింతల్‌లో ఏడో రోజు సహస్రాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నేడు రథసప్తమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దుష్టగ్రహ బాధల నివారణ కోసం యాగశాలలో శ్రీ నారసింహ ఇష్టి కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొనేందుకు విచ్చేశారు. దీనికి సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేందుకు క్రింద ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయండి.
శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వారి సారథ్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సమతామూర్తి శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇటీవలే ప్రధాని మోడీ శ్రీరామానుజ విగ్రహాన్ని అవిష్కరించారు. అయితే తాజాగా ముచ్చింతల్‌లోని చినజీయర్ స్వామి ఆశ్రమంలో రామానుజ సహస్రాబ్ధి సమారోహం వేడుకల్లో పాల్గొనేందుకు సీఎం జగన్ నేడు హైదరాబాద్‌కు రానున్నారు. ఈ సందర్భంగా శంషాబాద్‌లో శ్రీ రామానుజ సహస్రాబ్ధి ఉత్సవాల్లో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో కాసేపట్లో గన్నవరం విమానాశ్రయానికి సీఎం…
శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు 2వ రోజుకి చేరుకున్నాయి. సేవకాలంతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. ఉదయం 9గంటలకు శ్రీ లక్ష్మీ నారాయణ మహా క్రతువు ప్రారంభం. ముందుగా అగ్ని ఆవాహన కార్యక్రమం…శమి, రావి కర్రలతో అగ్ని మధనం.1035 కుండాలతో శ్రీ లక్ష్మీ నారాయణ యాగం. యాగ మహా క్రతువులో పాల్గొననున్న 5 వేల మంది ఋత్విక్కులు. ప్రవచన శాలలో వేద పండితులచే ప్రవచన పారాయణం వుంటుంది.
హైదరాబాద్ శివారున వున్న ముచ్చింతల్‌కు సమీపంలోని శ్రీరామనగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు ప్రారంభం అవుతున్నాయి. శ్రీ రామానుజాచార్యులు భూమిపై అవతరించి వెయ్యేళ్లు పూర్తయిన సందర్భంగా…. 216 అడుగుల విగ్రహం ఏర్పాటు చేశారు. ఆ విగ్రహ ఆవిష్కరణ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ఇవాళ్టి నుంచి 14 వరకు జరిగే… వివిధ కార్యక్రమాలకు… శ్రీరామ నగరాన్ని ముస్తాబు చేశారు. ఇప్పటికే సమతామూర్తి విగ్రహం ఎప్పుడు ఆవిష్కారం అవుతుందా అని భక్తులు వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు.…
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో మచ్చింతల్‌లో శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు జరగనున్న విషయం తెల్సిందే. అయితే ఈ ఉత్సవాలకు అతిరథ మహారథులు హాజరు కానున్నారు. ఈ ఉత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే చకచక జరిగిపోయాయి. రాష్ట్రపతి, ప్రధాని వంటి ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఇప్పటికే చిన్న జీయర్ స్వామి స్వయంగా ప్రముఖులకు ఆహ్వాన పత్రికలను సైతం పంచారు. చిన్న జీయర్ స్వామి ఆధ్యాత్మిక పరివర్తన క్షేత్రంలో సమతా స్ఫూర్తిని పంచిన…
శ్రీశ్రీశ్రీ రామానుజాచార్య 216 అడుగుల ఎత్తైన విగ్రహం ఫిబ్రవరి 5న ప్రపంచానికి అంకితం కానున్నది. కూర్చున్న స్థానంలో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద విగ్రహంగా పేర్కొనబడిన ఈ విగ్రహాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నట్లు చిన జీయర్ స్వామీజీ ఆశ్రమం ఓ ప్రకటన విడుదల చేసింది. విడుదల చేసిన ప్రకటన ప్రకారం, నగర శివార్లలోని 45 ఎకరాల కాంప్లెక్స్ వద్ద, రూ. 1,000 కోట్ల ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా భక్తుల నుండి వచ్చిన విరాళాల ద్వారా నిధులు సమకూర్చబడింది.…