ప్రతి ఏడాది కార్తీక మాసంలో భక్తీ టీవీ సారథ్యంలో కోటి దీపోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది కరోనా మహమ్మారి సమయంలోనూ నిబంధనలు పాటిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా హైదరాబాద్‌లోని కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. నవంబర్ 12 నుంచి నవంబర్ 22 వరకు కోటి దీపోత్సవం కార్యక్రమం జరిగింది.
Read: టీకా తీసుకుంటేనే సినిమా థియేటర్‌లోకి అనుమతి…
మొదటి రోజు నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కోటి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతిరోజు అనుగ్రహ భాషణం, ప్రవచనామృతం, వేదికపై పూజ, భక్తులచే పూజ, కళ్యాణం, వాహనసేవ వంటివి కన్నుల పండుగగా నిర్వహించారు. మొదటిరోజు జరిగిన కార్యక్రమంలో కాశీ స్పటిక లింగానికి సహస్ర కలశాభిషేకం, కోటి మల్లెల అర్చన, శివలింగాలకు కోటి మల్లెల అర్చన, కాళేశ్వరం శ్రీ ముక్తేశ్వర స్వామి కల్యాణం, హంస వాహనం, బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి ప్రవచనామృతం, కుర్తాళం పీఠం, శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహా స్వామి అనుగ్రహ భాషణం, శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి అనుగ్రహ భాషణం, జ్యోతి ప్రజ్వలన, బంగారు లింగోద్భవం, సప్త హారతి, మహా నీరాజనం, గురు వందనం వంటి కార్యక్రమాలు జరిగాయి.
Read: పాముతో పరాచకాలాడితే ఇలాగే ఉంటుంది.. వీడియో వైరల్
శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి వారు అందించిన అనుగ్రహ భాషణం అందరిని చరితార్థులను చేసింది. వైదిక ఆద్యాత్మిక వాజ్ఞ్మయాన్ని సామాన్యులదాక చేర్చిన ఆద్యాత్మిక విప్లవ స్పూర్తి శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చిన్న జియర్ స్వామి. సమతావాది…చెప్పింది ఆచరించేవాడు, ఆచరించిందే చెప్పావాడు ఆచార్యుడు. అటువంటి ఆచార్యుడి స్థానంలో ఉండి రామానుజాచార్యుల సిద్దాంతాలను పండితుల నుంచి పామరుల వరకు అర్ధమయ్యేలా చెప్పిన మానవతా వాది శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చిన్నజియర్ స్వామివారు. ఆయన అనుగ్రహ భాషణం ప్రతి ఒక్కరిని అకట్టుకుంది. మొదటి రోజు కార్యక్రమాల అనంతరం ఎన్టీవీ చైర్మన్ శ్రీ నరేంద్ర చౌదరిగారు శ్రీ శ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జియర్ స్వామి వారిని ఘనంగా సత్కరించారు.