Chinmoy Krishnadas: హిందూ ప్రచారకర్త చిన్మయ్ కృష్ణదాస్‌ను బంగ్లాదేశ్‌లో అరెస్టు చేశారు. అయితే, ఆయనపై తాజాగా మరో కేసు పెట్టినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. చిట్టగాంగ్ కోర్టు ప్రాంగణంలో హిందూ సన్యాసి మద్దతుదారులు, పోలీసులకు మధ్య గొడవ జరగడంతో కృష్ణదాస్ సహా 164 మందిపై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది.
బంగ్లాదేశ్‌లో హిందువుల పరిస్థితి నానాటికి దిగజారుతోంది. ఇటీవల హిందూ నాయకుడు చిన్మోయ్ కృష్ణదాస్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన ఆ దేశ జాతీయ జెండాను అగౌరవపరిచారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కృష్ణదాస్‌కు బెయిల్ కూడా నిరాకరించారు. ఇస్కాన్ ప్రచారకర్త చిన్మయ్ కృష్ణదాస్ ప్రభు ను వెంటనే విడుదల చేయాలని హిందూ సంఘాలు, ప్రజానికం నిరసనలు చేపట్టారు. వారిపై స్థానిక ముస్లింలు విచ్చలవిడిగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడులు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నిన్న ప్రధాని…
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ సమావేశం అయ్యారు. పొరుగు దేశంలోని పరిస్థితులపై ఈ భేటీలో ఇరువురు నేతలు ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. మరోవైపు బంగ్లాదేశ్‌తో పాటు పొరుగు దేశాలతో భారత్ సంబంధాలపై రేపు (నవంబర్ 29) జైశంకర్ పార్లమెంట్‌లో వివరించనున్నారు.
హిందువులు పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టారు. ఈ నేపథ్యంలో మరో కీలక పరిణామం నెలకొంది. ఇస్కాన్‌ను పూర్తిగా నిషేధించాలంటూ బంగ్లాదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇస్కాన్ సంస్థ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఢాకా ప్రభుత్వ వర్గాలు చెప్పుకొచ్చాయి.
Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ నేత, హిందూ సన్యాసి చిన్మోయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారిని బంగ్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ దేశంలో హిందువులకు పెద్ద దిక్కుగా ఉన్న బ్రహ్మచారిని అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. రాజధాని ఢాకాలో ఇతడిని అరెస్ట్ చేశారు. అక్కడి కోర్టులు ఆయనకు బెయిల్‌ని కూడా ఇవ్వకుండా,