బంగ్లాదేశ్‌లో హిందువుల పరిస్థితి నానాటికి దిగజారుతోంది. ఇటీవల హిందూ నాయకుడు చిన్మోయ్ కృష్ణదాస్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన ఆ దేశ జాతీయ జెండాను అగౌరవపరిచారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కృష్ణదాస్‌కు బెయిల్ కూడా నిరాకరించారు. ఇస్కాన్ ప్రచారకర్త చిన్మయ్ కృష్ణదాస్ ప్రభు ను వెంటనే విడుదల చేయాలని హిందూ సంఘాలు, ప్రజానికం నిరసనలు చేపట్టారు. వారిపై స్థానిక ముస్లింలు విచ్చలవిడిగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడులు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నిన్న ప్రధాని మోడీని విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ కలిశారు. పొరుగుదేశంలోని పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించారు.
READ MORE: Rishiteswari Case: సంచలనం సృష్టించిన కేసు కొట్టివేత.. మరణమే శరణ్యం అంటున్న పేరెంట్స్..
కాగా.. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో కొంత మంది ముస్లింలు హిందువుల ఇళ్లను బలవంతంగా తెరిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆలయాలపై దాడులు చేస్తూ.. హిందువులను చితక్కొడుతున్నట్లు చూడొచ్చు. ఈ ఘటన చిట్టగాంగ్‌లో జరిగినట్లు తెలిసింది. శుక్రవారం జుమ్మా ప్రార్థనల అనంతరం స్థానికంగా ఉన్న శాంతనేశ్వరి ఆలయంపై దాడి చేశారు. అంతే కాకుండా సమీపంలోని హిందువుల దుకాణాలు, ఇళ్లపై రాళ్లు రువ్వుతూ.. దాడులు చేశారు. ఈ దాడిలో చాలా మంది హిందువులకు గాయాలైనట్లు సమాచారం. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు వారిని పాపుతున్నా.. లెక్కచేయకుండా దాడులకు పాల్పడుతున్నారు. దీంతో హిందు ప్రజానికం బయటకు రావాలంటేనే జంకుతున్న పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడం లేదు. వ్యాపారస్థులు, రోజువారీ కూలీలు పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది.
READ MORE:Congress: కాంగ్రెస్‌లో ‘‘మహా’’ ఓటమి నిరాశ.. కుట్ర దాగి ఉందని ఈసీకి ఫిర్యాదు..
ఈ వీడియోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. “బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో శుక్రవారం జుమ్మా ప్రార్థనల అనంతరం శాంతనేశ్వరి ఆలయంపై రాడికల్స్ దాడి చేశారు. హిందువుల దుకాణాలు, ఇళ్లపై దాడులు జరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. పలువురికి గాయాలైనట్లు సమాచారం!” అని క్యాప్షన్‌లో రాసుకొచ్చారు. భారత్ త్వరగా స్పందించి ఈ సమస్యకు పరిష్కారం తీసుకురావాలని కోరుతున్నారు.
Urgent 🚨 Alert
In Bangladesh's Chittagong, Radicals have attacked the Shantaneswari Temple after Friday Jumma prayers.
Reports claiming Hindu shops and houses being attacked. Many Injured!! pic.twitter.com/zOS0iWMcHD
— Megh Updates 🚨™ (@MeghUpdates) November 29, 2024