హైదరాబాద్ శంషాబాద్ శివారులోని ముచ్చింతల్‌లో రామానుజాచార్యుల విగ్రహాన్ని సందర్శించిన రాందేవ్ బాబా.. చినజీయర్ స్వామిపై ప్రశంసలు కురిపించారు. రామానుజాచార్యుల విగ్రహం ఏర్పాటు చేసిన చినజీయర్‌స్వామి చరిత్రలో నిలిచిపోతారని యోగా గురు రాందేవ్ బాబా అన్నారు. భారత వాస్తు, సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలనుకునేవారు కచ్చితంగా రామానుజాచార్యుల దివ్యక్షేత్రాన్ని సందర్శించాలని సూచించారు. తాను వీలైనన్నిసార్లు ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటానని రాందేవ్ బాబా చెప్పారు. అటు భారతీయ సంస్కృతిలో అసమానత, అన్యాయం ఉందని కొందరు పదేపదే వాదిస్తుంటారని.. సనాతన ధర్మంపై…
రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని చిన్నజీయర్ స్వామి ఆశ్రమం వద్ద శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు జరిగిన రెండో రోజు ఉత్సవాలకు సీఎం కేసీఆర్ సతీసమేతంగా హాజరయ్యారు. తొలుత భారీస్థాయి ఏర్పాటు చేసిన శ్రీరామానుజ విగ్రహ ప్రాంగణాన్ని సీఎం కేసీఆర్ పరిశీలించి పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… శ్రీరామానుజచార్యుల విగ్రహం సమానత్వానికి ప్రతీకలాంటిదని తెలిపారు. దేవుడి ముందు ప్రజలందరూ సమానమే అన్నారు. రామానుజచార్యులు అందరినీ సమానంగా ప్రేమిస్తారని… మనం కూడా రామానుజ…
హైదరాబాద్ నగరం శివారులోని ముచ్చింతల్‌లో రామానుజచార్యుల సహస్రాబ్ది వేడుకల నేపథ్యంలో తపాలా శాఖ ప్రత్యేకంగా పోస్టల్ కవర్‌ను రూపొందించింది. ఈ మేరకు తపాలా శాఖ ముద్రించిన పోస్టల్ కవర్‌ను చినజీయర్ స్వామి, మై హోం అధినేత జూపల్లి రామేశ్వరరావు ఆవిష్కరించారు. అనంతరం సమతా మూర్తి విగ్రహం ఎదుట తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 2,500 మంది కళాకారులు ప్రత్యేక ప్రదర్శన చేపట్టారు. మరోవైపు బుధవారం సాయంత్రం 5 గంటలకు సమతామూర్తి సహస్రాబ్ది వేడుకలకు అంకురార్పణ జరిగింది.…
హైదరాబాద్ శంషాబాద్ లోని ముచ్చింతల్ ఆశ్రమం మహాకార్యానికి వేదిక కాబోతోంది. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు జరగనున్నాయి. చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకల్లో సమతామూర్తి పేరిట నిర్మించిన 216 అడుగుల శ్రీరామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. చినజీయర్ స్వామిని కలిశారు. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ దివ్యసాకేతానికి వెళ్లారు శివరాజ్ సింగ్ చౌహాన్. కుటుంబసభ్యులతో కలిసి చినజీయర్ స్వామి ఆశ్రమంలో ప్రతిష్ఠాత్మకంగా…