US-China War: తైవాన్ విషయంలో చైనా దుందుడుకు చర్యల్ని ప్రారంభిస్తే, అమెరికా ఆ దేశంతో యుద్ధానికి సిద్ధమవుతోందా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి. అమెరికా, చైనాతో యుద్ధానికి వెళ్తే.. జపాన్, ఆస్ట్రేలియా ఎలాంటి పాత్ర పోషిస్తాయని పెంటగాన్ ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది.
China Bans American Companies: చైనా-అమెరికా సంబంధాల్లో తాజాగా కొత్త మలుపు చోటుచేసుకుంది. తైవాన్‌కు అమెరికా సైనిక సహాయం అందిస్తున్న నేపథ్యంలో, బోయింగ్ అనుబంధ సంస్థ ఇన్సిటుతో సహా మొత్తం 10 అమెరికన్ డిఫెన్స్ కంపెనీలపై చైనా ఆంక్షలు విధించింది. ఈ చర్యను చైనా తన జాతీయ భద్రతా ప్రయోజనాలను కాపాడుకునే ప్రయత్నంగా చిత్రీకరించింది. లాక్‌హీడ్ మార్టిన్, జనరల్ డైనమిక్స్, రేథియాన్ వంటి ప్రముఖ కంపెనీలు చైనా “అవిశ్వాస యూనిట్” జాబితాలో చేర్చబడ్డాయి. ఈ కంపెనీలు తైవాన్‌కు…
China: చైనా, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు పెరిగేలా కనిపిస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో ట్రంప్ యూఎస్ అధ్యక్షుడిగా అధికారం చేపట్టే లోపే వాణిజ్య యుద్ధానికి చైనా సిద్ధమైనట్లు తెలుస్తోంది. అమెరికా రక్షణ సంస్థలపై ఆంక్షలను తీవ్రతరం చేయడం ద్వారా చైనా యూఎస్‌కి సవాల్ విసిరింది. ఒక వారం వ్యవధిలోనే చైనా ఈరోజు 10 యూఎస్ కంపెనీలపై సెకండ్ రౌండ్ ఆంక్షలను ప్రకటించింది. తైవాన్‌కి ఆయుధాలు అమ్మడం వల్లే చైనా, యూఎస్ కంపెనీలపై జరిమానాలు, ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది.
China Taiwan: చైనా, తైవాన్ దేశాల మధ్య ఉద్రిక్తత నిరంతరం పెరుగుతోంది. మరోసారి చైనా సైన్యం తైవాన్ సరిహద్దుల్లోకి చొరబడేందుకు ప్రయత్నించింది. అయితే తైవాన్ సైన్యం కూడా స్పందించింది. తైవాన్ సరిహద్దుకు సమీపంలో చైనా విమానాలు, నౌకాదళ నౌకలు కనిపించాయని తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. మంగళవారం ఉదయం 6 గంటలకు తైవాన్ చుట్టూ 14 చైనా నౌకాదళ నౌకలు, 12 అధికారిక నౌకలు కనిపించాయని తైవాన్ జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ (MND) తెలిపింది.…
అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటనతో తైవాన్-చైనాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. పెలోసీ పర్యటనకు ప్రతీకారంగా తైవాన్ చుట్టూ చైనా చేపట్టిన భారీ సైనిక విన్యాసాలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తైవాన్ రక్షణ రంగానికి చెందిన ఓ కీలక అధికారి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు.