China Bans American Companies: చైనా-అమెరికా సంబంధాల్లో తాజాగా కొత్త మలుపు చోటుచేసుకుంది. తైవాన్‌కు అమెరికా సైనిక సహాయం అందిస్తున్న నేపథ్యంలో, బోయింగ్ అనుబంధ సంస్థ ఇన్సిటుతో సహా మొత్తం 10 అమెరికన్ డిఫెన్స్ కంపెనీలపై చైనా ఆంక్షలు విధించింది. ఈ చర్యను చైనా తన జాతీయ భద్రతా ప్రయోజనాలను కాపాడుకునే ప్రయత్నంగా చిత్రీకరించింది. లాక్‌హీడ్ మార్టిన్, జనరల్ డైనమిక్స్, రేథియాన్ వంటి ప్రముఖ కంపెనీలు చైనా “అవిశ్వాస యూనిట్” జాబితాలో చేర్చబడ్డాయి. ఈ కంపెనీలు తైవాన్‌కు ఆయుధాలను విక్రయించడంలో కీలక పాత్ర పోషించాయని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. తైవాన్‌ను అవిశ్వాస దేశంగా చైనా పరిగణిస్తున్నందున, ఆ దేశానికి సైనిక సహాయం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
Also Read: RIP GOUTAM GAMBHIR: టీమిండియా కోచ్‌పై విరుచుకపడుతున్న క్రికెట్ అభిమానులు
ఇక ఈ చర్యతో సదరు కంపెనీలు ఇకపై చైనాలో కొత్త పెట్టుబడులు పెట్టలేవు. అలాగే దిగుమతి, ఎగుమతి కార్యకలాపాల్లో పాల్గొనలేవు. అలాగే కంపెనీల సీనియర్ మేనేజర్లకు చైనా ప్రవేశం కూడా నిలిపివేయబడింది. ఇది అమెరికన్ కంపెనీలపై చైనా విధించిన తొలి ఆంక్షలు కావు. కానీ, తైవాన్ పట్ల తన కఠిన వైఖరిని చైనా మరింత బలోపేతం చేస్తూ మరోసారి చర్యలు చేపట్టింది.తైవాన్‌ను తన భూభాగంలో భాగంగా పరిగణిస్తున్న చైనా, దాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. కానీ, తైవాన్ అమెరికాకు వ్యూహాత్మక మిత్రదేశం మాత్రమే కాకుండా, అతిపెద్ద ఆయుధ సరఫరాదారుడు కూడా. గత డిసెంబరులో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తైవాన్‌కు 571.3 మిలియన్ల డాలర్స్ రక్షణ సహాయాన్ని మంజూరు చేశారు. ఈ పరిణామాలు చైనా-అమెరికా మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. తైవాన్‌కు సైనిక సహాయం చేయడంలో కీలకంగా ఉన్న కంపెనీలపై గత వారం చైనా మరోసారి ఏడింటిపై ఆంక్షలు విధించింది. తైవాన్ పట్ల చైనా తీసుకుంటున్న ఈ నిర్ణయాలు, భవిష్యత్‌లో చైనా-అమెరికా సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తాయో చూడాలి.