Pakistan: ద్రోహం, వంచనకు మారుపేరు ‘‘పాకిస్తాన్’’. ఇన్నాళ్లు కష్టకాలంలో ఆర్థికంగా, సైనికంగా రక్షిస్తూ వస్తున్న డ్రాగన్ కంట్రీ చైనాకు పాకిస్తాన్ నమ్మకద్రోహం చేస్తోంది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌లు అమెరికా పంచన చేరి, చైనా ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నారు. రెండు దేశాల మధ్య పాకిస్తాన్ డేంజరస్ గేమ్ ఆడుతోంది. ఇటీవల, పాకిస్తాన్ ట్రంప్‌తో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతోంది. ముఖ్యంగా, ఇరు దేశాల మధ్య ‘‘ఖనిజ ఒప్పందం’’ కుదిరింది. దీంతో బలూచిస్తాన్…
Pakistan: పాకిస్తాన్ ఒకే సారి రెండు దేశాలతో ప్రేమాయణం నడుపుతోంది. చైనాకు కన్నుగీటి, అమెరికాను కౌగిలించుకుంటోంది. తమ ఉక్కు స్నేహితుడిగా చైనాను, పాకిస్తాన్ పిలుస్తుంటుంది. అయితే, అలాంటి స్నేహితుడిని ఇప్పుడు పక్కన పెట్టినట్లు కనిపిస్తోంది. అమెరికాలో ట్రంప్ అధికారంలోకి రావడంతో పాకిస్తాన్ నాయకత్వం డొనాల్డ్ ట్రంప్ పరిపాలనకు దగ్గర అవుతోంది. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ ఇప్పటికే ట్రంప్‌తో వైట్‌హౌజ్‌లో విందులో పాల్గొన్నారు. ఇప్పుడు, పాకిస్తాన్ ప్రధాని కూడా ట్రంప్‌తో భేటీ అయ్యేందుకు సిద్ధమయ్యారు.
Pakistan: పాకిస్తాన్‌కి చైనా షాక్ ఇచ్చింది. చైనా పాకిస్తాన్‌లోని గ్వాదర్ పోర్ట్‌ని, తమ దేశంలోని జిన్జియాంగ్ ప్రావిన్సులను కలుపుతూ రోడ్డు, రైలు నెట్వర్క్‌ను అభివృద్ధి చేస్తుంది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(బీఆర్ఐ)లో భాగంగా చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(CPEC) చేపట్టింది. ఇప్పటికే బలూచిస్తాన్‌లోని గ్వాదర్ పోర్టును డెవలప్ చేసింది.
Asim Munir: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, ఆ దేశ ప్రధాని షహజాబ్ షరీఫ్ కన్నా ఎక్కువగా విదేశాల పర్యటిస్తున్నారు. తాజాగా, ఆయన చైనా పర్యటనకు వెళ్లారు. అయితే, మునీర్ తన బీజింగ్ పర్యటనలో చైనా చేతిలో చీవాట్లు తిన్నట్లు తెలుస్తోంది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, ఆసిమ్ మునీర్‌ని నేరుగా మందలించిన పనిచేశారు. పాకిస్తాన్‌లో చైనా ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న చైనీయుల భద్రత గురించి వాంగ్ యీ ఆందోళన వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా…
Pakistan: పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఏం మాట్లాడినా సంచలనంగా మారుతోంది. ఆపరేషన్ సిందూర్, పహల్గామ్ దాడి సమయంలో ఆయన స్వయంగా పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిందని ఒప్పుకున్నారు. ఆ తర్వాత పాక్ నేషనల్ అసెంబ్లీలో భారత దాడుల గురించి తప్పుడు ప్రకటనలు చేస్తూ దొరికిపోయారు.
Article 370: ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై చైనా మంగళవారం స్పందించింది. కశ్మీర్ సమస్యను భారత్-పాక్ మధ్య చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పేర్కొంది.