HYD: పాతబస్తీలో భారీగా నిషేధిత చైనా మాంజాను పట్టుకున్నారు. దాదాపు రూ.2 కోట్ల విలువైన చైనా మాంజా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పాతబస్తీలోని పతంగుల విక్రయ షాపుల్లో సోదాలు నిర్వహించి.. టాస్క్‌ఫోర్స్, పోలీసుల జాయింట్ ఆపరేషన్ చేశారు. చైనా మాంజా విక్రయదారులను అరెస్టు చేశారు పోలీసులు. అయితే.. సంక్రాంతి వేళ నిషేధిత చైనీస్ సింథటిక్ మాంజా విస్తృతంగా వినియోగం అవుతోంది. ఈ మాంజా రోడ్లపై, చెట్లపై తెగిపడి వాహనదారులకు ప్రమాదకరంగా మారగా, పక్షుల ప్రాణాలను సైతం హరిస్తోంది.…
హైదరాబాద్‌లో గతేడాది విషాదం నెలకొంది. లంగర్ హౌజ్ లో చైనా మాంజా దారం మెడకు చుట్టుకుని ఆర్మీ జవాన్ మృతి చెందాడు. లంగర్ హౌస్ ఫ్లై ఓవర్ వద్ద సైనికుడి మెడకు మాంజా చుట్టుకుని ప్రమాదం జరిగింది. విధులు ముగించుకుని బైక్ పై ఇంటికి వెళ్తున్న సైనికుడికి ఈ ప్రమాదం జరిగింది. మాంజా మెడకు చుట్టుకోవడంతో సైనికుడికి తీవ్రగాయాలు అయ్యాయి. అతడ్ని స్థానిక ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సైనికుడు కోటేశ్వరరావు మృతి చెందాడు.
Kite Manja : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రామవరంలో చైనా మాంజా ఉపయోగంతో తీవ్ర ప్రమాదం చోటుచేసుకుంది. పతంగి ఎగరేసేందుకు వాడిన నిషేధిత చైనా మాంజా ద్విచక్ర వాహనదారుడి మెడకు చుట్టుకోవడంతో అతని మెడకు తీవ్రంగా గాయమైంది. ఈ ఘటనలో రక్తస్రావం అధికంగా కావడంతో గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా మారింది. స్థానికులు అతనిని కొత్తగూడెంలోని ఆసుపత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం తర్వాత హైదరాబాద్‌కి తరలించారు. నిర్వహణ , నిషేధ ఆదేశాలున్నప్పటికీ, చైనా మాంజా ఇప్పటికీ…
చైనా మాంజా దారం తగిలి గొంతుపై బలమైన గాయం కావడంతో ఓ ఆర్మీ జవాన్ మృతి చెందిన ఘటన హైదరాబాద్‌లోని లంగర్ హౌజ్‌లో చోటు చేసుకుంది. వైజాగ్‌కు చెందిన కె.కోటేశ్వర్‌రెడ్డి (28) గోల్కొండ మిలటరీ ఆస్పత్రిలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం సాయంత్రం విధులు ముగించుకుని అత్తాపూర్‌లోని తన ఇంటికి వెళ్తుండగా లంగర్ హౌజ్ ఫ్లైఓవర్‌పై చైనా మాంజా తన గొంతుకు తగిలింది. దీంతో కోటేశ్వర్ మెడపై బలమైన గాయం తగిలి రోడ్డుపై కుప్పకూలిపోయాడు. అతన్ని వెంటనే ఆసుపత్రికి…
Chinese Manja : గాలిపటాలు ఎగురవేసేటప్పుడు చైనా మాంజా అస్సలు ఉపయోగించొద్దంటూ పదపదే ప్రభుత్వ అధికారులు సూచిస్తుంటారు. అంతేకాకుండా చైనా మాంజా విక్రయాలపై ప్రభుత్వం నిషేధం కూడా విధించింది.