China Manja : ఆర్మీ జవాన్ ప్రాణం బలిగొన్న చైనా మాంజా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనా మాంజా దారం తగిలి గొంతుపై బలమైన గాయం కావడంతో ఓ ఆర్మీ జవాన్ మృతి చెందిన ఘటన హైదరాబాద్‌లోని లంగర్ హౌజ్‌లో చోటు చేసుకుంది. వైజాగ్‌కు చెందిన కె.కోటేశ్వర్‌రెడ్డి (28) గోల్కొండ మిలటరీ ఆస్పత్రిలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం సాయంత్రం విధులు ముగించుకుని అత్తాపూర్‌లోని తన ఇంటికి వెళ్తుండగా లంగర్ హౌజ్ ఫ్లైఓవర్‌పై చైనా మాంజా తన గొంతుకు తగిలింది. దీంతో కోటేశ్వర్ మెడపై బలమైన గాయం తగిలి రోడ్డుపై కుప్పకూలిపోయాడు. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడని లాంగర్ హౌజ్ ఇన్‌స్పెక్టర్ జె నిరంజన్ రావు తెలిపారు.
కోటేశ్వర్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరలించి, పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే.. ఇప్పటికే పలువురు గాలిపటాలు ఎగురవేస్తూ మృత్యుఒడిలోకి జారుకోవడం ఆయా కుటుంబాలను విషాదంలో ముంచాయి. గాలిపటాలు ఎగురవేస్తునప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా.. ప్రమాదం కలిగించే చైనా మాంజా వాడకూడదని హెచ్చరికలు జారీ చేసినా కొందరు నిబంధనలు ఉల్లంఘించి చైనా మాంజా విక్రయిస్తున్నారు. పండుగను ఎంతో సుఖసంతోషాలతో జరుపుకోవాలని భావిస్తున్న వేళలో ఇలాంటి వార్తలు వినడం బాధాకరంగా ఉందని పలువురు అంటున్నారు.
Also Read
- IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
- CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
- Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
తాజావార్తలు
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
-
Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
-
Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!