Chile : చిలీలో జనసాంద్రత ఉన్న ప్రాంతాలకు వ్యాపించిన భారీ అడవి మంటల కారణంగా మరణించిన వారి సంఖ్య 64 కి చేరుకుంది. చిలీలోని మధ్య ప్రాంతంలోని అడవిలో రెండు రోజుల క్రితం సంభవించిన భారీ అగ్నిప్రమాదం కారణంగా ఆదివారం అగ్నిమాపక శాఖ సిబ్బంది చాలా కష్టపడాల్సి వచ్చింది.