ప్రధాని మోదీ శుక్రవారం మహారాష్ట్రలోని షోలాపూర్ లో పర్యటించారు. అక్కడ.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ పథకం కింద పేద ప్రజలకు ఆయన చేతుల మీదుగా ఇళ్లను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. దేశంలోనే పీఎం ఆవాస్ యోజన కింద నిర్మించిన అతిపెద్ద సొసైటీని నేడు ప్రారంభించామని తెలిపారు. 2014లో హామీ ఇచ్చానని.. ఆ వాగ్దానం నెరవేరడం, దాన్ని చూడటానికి రావడం.. ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. మరోవైపు.. ఈ ఇళ్లను చూడగానే తనకు బాల్యం గుర్తొచ్చిందని పేర్కొన్నారు. చిన్నతనంలో…