చిక్కాల రామచంద్రరావు. టీడీపీ సీనియర్ నేత. మొదట నుంచి పార్టీలో ఉన్నప్పటికి ఒక్క ఓటమితో ఆయనకి నియోజకవర్గం అంటు లేకుండా పోయింది. 2012లో చివరిసారిగా అసెంబ్లీకి పోటీ చేసిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో మరోసారి అదృష్టం పరీక్షించుకోవాలని చూస్తున్నారట. ఇందుకు నియోజకవర్గాన్ని కూడా ఎంచుకుని గ్రౌండ్‌వర్క్ చేసుకుంటుండంతో కాకినాడ జిల్లా టీడీపీలో ఒక్కసారిగా చర్చల్లోకి వస్తున్నారు. తాళ్లరేవు నుంచి 1983లో తొలిసారి ఇండిపెండెంట్‌గా గెలిచిన చిక్కాల..1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో వరసగా సైకిల్ పార్టీ నుంచి…