ఒక్కొక్కరికి ఒక్కో అభిమానం ఉంటుంది. కొందరికి సినిమా స్టార్లు అంటే పిచ్చి. ఇంకొందరికి రాజకీయ నేతలంటే అభిమానం. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ఏపీలోనూ అభిమానులు ఉన్నారు. దీంతో కేటీఆర్ సీఎం కావాలంటూ ఏపీలోని ఓ అభిమాని బైక్ యాత్ర చేపట్టాడు. గుంటూరు జిల్లాకు చెందిన బాలరాజుగౌడ్ అనే వ్యక్తి వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ గుంటూరు జిల్లా మాచర్ల నుంచి యాదాద్రి వరకు బైక్ యాత్రకు శ్రీకారం చుట్టాడు. తన బైక్…
మణిపూర్ సీఎంగా బీరెన్‌సింగ్ సోమవారం నాడు ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ గణేశన్ ప్రమాణం చేయించారు. మరో ఐదుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇంఫాల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా, త్రిపుర సీఎం బిప్లవ్‌కుమార్ హాజరయ్యారు. హెయ్‌గాంగ్ నియోజకవర్గం నుంచి బీరెన్ సింగ్ 17వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. బీరెన్‌సింగ్ వరుసగా ఐదోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అంతేకాకుండా రెండోసారి మణిపూర్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. కాగా ప్రమాణస్వీకారం చేసిన…
కర్ణాటక బీజేపీ సీనియర్ నేత యడ్యూరప్ప మళ్లీ సీఎం కాబోతున్నారు. అయితే ఇది నిజంగా కాదండోయ్. కేవలం సినిమా వరకే పరిమితం. సినిమాల్లో పేరు తెచ్చుకుని రాజకీయాల్లోకి వచ్చి చక్రం తిప్పిన చాలామందిని మనం చూశాం. కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నారు. ఆయన రాజకీయాల్లో ఆరితేరి ఇప్పుడు ముఖానికి రంగేసుకుంటున్నారు. తనూజ అనే సినిమాతో యడ్యూరప్ప తెరంగేట్రం చేస్తున్నారు. ఓ రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో యడ్యూరప్ప సీఎంగా నటిస్తున్నారు. హరీష్…