మహారాష్ట్రలో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన-బీజేపీ కూటమి మెజారిటీ సాధించిన తర్వాత సీఎం పదవికి ఏక్ నాథ్ షిండే పేరును తమ పార్టీ ప్రతిపాదించిందని ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. కానీ దాన్ని బీజేపీ పార్టీ తిరస్కరించింది అని ఆయన తెలిపారు.
ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ నేతృత్వంలోని సమిష్టి నాయకత్వంలో కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడుతుందని, పార్టీ గెలిస్తే, సీఎం పదవికి పరిగణించబడే వరుసలో బఘేల్ మొదటి స్థానంలో ఉంటారని ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి టీఎస్ సింగ్ డియో ఆదివారం అన్నారు.
త్వరలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తుందని బీజేపీ ఓడిపోవడం ఖాయమని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. గడిచిన ఐదేళ్ళలో మా ప్రభుత్వం అనుసరించిన విధానాలు, మేము చేసిన అభివృద్ధిని మాత్రమే ప్రజలు తీసుకుంటారు.
తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ తర్వాత సీఎం ఎవరన్నదానిపై ప్రచారం సాగుతుంది. ఇప్పుడు కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు మొగ్గు చూపుతుండటంతో.. అటు నేతలతో పాటు ఇటు ప్రజల్లో కూడా ఓ ప్రశ్నగా మారిపోయింది. ఇప్పుడు తాజాగా తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.. తన మనసులోని మాటను వెల్లగక్కారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ తర్వాత కేటీఆరే సీఎం అవుతారని తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. దళితులు, గిరిజనులు సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలను ఆపండి అంటూ అందులో పేర్కొన్నారు.
Fund For Orphans: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అనాథ పిల్లల ఉన్నత విద్యకు నిధిని ప్రకటించారు. రాష్ట్రంలోని సుమారు 6,000 మంది అనాథ పిల్లలకు నూతన సంవత్సర కానుకగా రూ. 101 కోట్ల నిధిని సీఎం సుఖాశ్రయ సహాయత కోష్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
Vande Bharat Express : పశ్చిమ బెంగాల్‌లోని హౌరా రైల్వే స్టేషన్‌లో కొద్దిసేపు హైడ్రామా చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.
రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు క్రాస్ ఓటింగ్ వేసిన తన మంత్రివర్గంలోని మంత్రులకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కృతజ్ఞతలు తెలిపారు. NDA అభ్యర్థి ద్రౌపది ముర్ము ఎన్నికల్లో విజయం సాధించి భారతదేశ తదుపరి రాష్ట్రపతి అవుతారని వెల్లడించారు. ముర్ము గెలుపును సంబరాలు చేసుకుంటూ, శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, “తమ మనస్సాక్షి మాటను విని, ద్రౌపది ముర్మును తదుపరి అధ్యక్షురాలిగా చేయాలని నిర్ణయించుకున్న ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. “గిరిజన…
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తేలికపాటి జ్వరంతో అస్వస్థత చెందారని ఆ రాష్ట్ర నీటివనరుల శాఖ మంత్రి దురైమురుగన్ తెలిపారు. శనివారం రాత్రి నుంచి ఆయనకు జ్వరం రావటంతో వైద్యులు పరిశీలించి రెండు రోజుల విశ్రాంతి అవసరమని సూచించారని మంత్రి దురైమురుగన్ వెల్లడించారు. జ్వరం కారణంగా సోమవారం మూడు జిల్లాల్లో జరగాల్సిన ముఖ్యమంత్రి పర్యటన రద్దయ్యింది. ముందుగా ప్రకటించిన మేరకు స్టాలిన్ వేలూరు, తిరుపత్తూరు, రాణిపేట జిల్లాల్లో ఈ రోజు పర్యటించాల్సి ఉంది. స్టాలిన్ పర్యటనకు అధికారులు,…