మాంసాహార ప్రియులు చికెన్ వంటకాలంటే లొట్టలేసుకుంటారు. చికెన్‌తో ఏం చేసినా ఇష్టంగా తింటుంటారు. అయితే ఓ చికెన్ వంటకం.. యువకుడి ప్రాణాలు తీయగా.. మరో ఐదుగురు అస్వస్థతకు గురయ్యారు.
Chicken Shawarma: ఇటీవల కాలంలో పిల్లలు స్ట్రీట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ కి విపరీతంగా అట్రాక్ట్ అవుతున్నారు. కొన్ని సందర్బాల్లో ఇవి అనారోగ్యానికి కారణమవుతున్నాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, టైఫాయిడ్, డయేరియా వంటి రోగాల బారిన పడుతున్నారు. పిల్లల ఆనందం కోసం తల్లిదండ్రులు కూడా వీటిని కొనిచ్చేందుకు వెనకాడటం లేదు. అయితే పిల్లల ఆరోగ్యాన్ని, ప్రాణాల్ని పణంగా పెడుతున్నామని పేరెంట్స్ కి అర్థం కావడం లేదు.