Chicken Shawarma: ఇటీవల కాలంలో పిల్లలు స్ట్రీట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ కి విపరీతంగా అట్రాక్ట్ అవుతున్నారు. కొన్ని సందర్బాల్లో ఇవి అనారోగ్యానికి కారణమవుతున్నాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, టైఫాయిడ్, డయేరియా వంటి రోగాల బారిన పడుతున్నారు. పిల్లల ఆనందం కోసం తల్లిదండ్రులు కూడా వీటిని కొనిచ్చేందుకు వెనకాడటం లేదు. అయితే పిల్లల ఆరోగ్యాన్ని, ప్రాణాల్ని పణంగా పెడుతున్నామని పేరెంట్స్ కి అర్థం కావడం లేదు.
Read Also: India: కెనడా ఆరోపణలు అసంబద్ధం.. ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్యపై ఇండియా స్ట్రాంగ్ రిఫ్లై
తాజాగా తమిళనాడులో జరిగిన ఓ ఘటన ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. చికెన్ షవర్మా తిని ఓ బాలిక మరణించింది. తమిళనాడు నమక్కల్ జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలిక ఆదివారం రాత్రి చికెన్ షావార్మా తిని, ఫుడ్ ఫాయిజన్ కారణణంగా సోమవారం మరణించింది. వివరాల్లోకి వెళ్తే బాలిక తండ్రి ఓ రెస్టారెంట్ నుంచి చికెన్ షావార్మాతో పాటు ఇతర నాన్ వెజ్ ఫుడ్ ని తీసుకువచ్చాడు. బాలిక తన కుటుంబంతో కలిసి చికెన్ షావార్మా తింది.
అదే రోజు రాత్రి ఫుడ్ ఫాయిజన్ కావడంతో బాలికను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఇంటికి తీసుకువచ్చిన కొద్ది సేపటికే బాలిక మరణించింది. ఇదే రెస్టారెంట్ లో మాంసాహారం తిని 13 మంది అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. అధికారులు వెంటనే రెస్టారెంట్ పై దాడి చేసి నమూనాలను సేకరించి, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. గ్రిల్డ్ చికెన్, తందూరీ చికెన్, షావార్మా తిన్న వారికి ఫుడ్ పాయిజన్ అయినట్లు విచారణలో తేలింది. చికెన్ ఎక్కడ నుంచి తీసుకువచ్చారనే దానిపై కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.