ఛత్తీస్‌గఢ్‌లో 2018లో కాంగ్రెస్ చేతిలో ఓడిపోవడానికి ముందు 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ.. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం మేనిఫెస్టోను రూపొందించేందుకు 31 మంది సభ్యులతో కూడిన ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది.
ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాలకు భారతీయ జనతా పార్టీ శుక్రవారం ఎన్నికల ఇన్ఛార్జ్లను ప్రకటించింది. వచ్చే ఏడాది అన్నింటికంటే ముఖ్యమైన లోక్‌సభ ఎన్నికలకు కూడా వారే ఇన్‌ఛార్జులుగా వ్యవహరిస్తారు.
PM Modi: ఈ ఏడాది ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు ఛత్తీస్‌గఢ్ పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో దాదాపు రూ.7,600 కోట్ల విలువైన ఎనిమిది ప్రాజెక్టులకు మంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ జూలై 7న ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, మరుసటి రోజు తెలంగాణ, రాజస్థాన్‌లలో పర్యటించి దాదాపు రూ.50,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు లేదా శంకుస్థాపనలు చేయనున్నారు.
Goat Eye: ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్ జిల్లాలో మేకను బలి ఇచ్చిన తర్వాత, దాని కన్ను ఒక వ్యక్తిని చంపింది. విచిత్రంగా అనిపించినా ఇది నిజం. ఈ ఉదంతం ప్రసిద్ధ ఖోపా ధామ్‌లో జరిగింది. అక్కడ మేకను బలి ఇచ్చిన తర్వాత తింటారు. ఈ సమయంలో మేక కన్ను కారణంగా గ్రామస్థుడు మరణించాడు.
ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రిగా టీఎస్ సింగ్ డియోను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే బుధవారం నియమించారు. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో త్వరలో జరగనున్న ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలపై చర్చించేందుకు జరిగిన సమీక్షా సమావేశంలో సింగ్ డియో నియామకాన్ని ప్రకటించారు.
త్తీస్‌గఢ్‌లోని బలోద్ జిల్లా గుండర్ దేహి బ్లాక్ కు చెందిన ఖుతేరి గ్రామ ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. ఊరిలో ఉండే ట్యాంక్ లోని నీరు తాగి 132 మంది అస్వస్థతకు గురయ్యారు. అయితే గ్రామంలోనే వారికి తాత్కాలిక శిబిరం ఏర్పాటు చేసి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అస్వస్థతకు గురైన వారిలో 112 మంది జ్వరంతో బాధపడుతుండగా.. 5 మందికి వాంతులు విరేచనాలు, 15 మంది జలుబు, దగ్గుతో బాధపడుతున్నట్లు గుర్తించారు.
ఛత్తీస్‌గఢ్ కేడర్‌కు చెందిన సీనియర్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారి రవి సిన్హా సోమవారం రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW) కొత్త చీఫ్‌గా నియమితులయ్యారు.