New RAW Chief: ‘రా’ అధిపతిగా ఐపీఎస్ అధికారి రవి సిన్హా నియామకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New RAW Chief: ఛత్తీస్‌గఢ్ కేడర్‌కు చెందిన సీనియర్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారి రవి సిన్హా సోమవారం రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW) కొత్త చీఫ్‌గా నియమితులయ్యారు. భారత నిఘా విభాగమైన రీసెర్చి అండ్ అనాలసిస్ వింగ్(RAW ) అధిపతిగా 1988 బ్యాచ్ ఐపీఎస్ అధికారి రవిసిన్హాను సర్కారు నియమించింది. ఈ నిర్ణయానికి ‘నియామకాలపై కేంద్ర మంత్రుల కమిటీ’ ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read: Thane Court: మైనర్ బాలికపై అత్యాచారం, ఆపై హత్య.. నిందితుడిని నిర్ధోషిగా ప్రకటించిన థానే కోర్టు
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
ఇప్పటికే ఈ పదవిలో కొనసాగుతున్న సమంత్ కుమార్ గోయల్ రిటైర్మెంట్ తీసుకోనున్నారు. జూన్ 30న తన పదవీకాలం పూర్తికానుండగా, ప్రస్తుత సమంత్ కుమార్ గోయెల్ స్థానంలో రవి సిన్హా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయనకు ఇప్పటికే పలు మార్లు కేంద్ర ప్రభుత్వం పదవీకాలాన్ని పొడిగించింది. విదేశాల్లో అత్యంత కీలకమైన నిఘా కార్యకలాపాలను ‘రా’ నిర్వహిస్తోంది. 1988 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన సిన్హా ప్రస్తుతం క్యాబినెట్ సెక్రటేరియట్ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
ఛత్తీస్‌గఢ్ కేడర్‌కు చెందిన రవి గత ఏడేళ్లుగా ‘రా’ ఆపరేషనల్ విభాగంలో అధిపతిగా సేవలు అందిస్తున్నారు. ఆయన ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఆయన వ్యక్తిగత వివరాలు చాలా వరకు గోప్యంగా ఉన్నాయి. భారత ఇంటెలిజెన్స్ విభాగంలో ప్రతిభావంతుడిగా ఆయనకు పేరుంది. ఆయన వివిధ విభాగాల్లో పనిచేశారు. పొరుగు దేశాల్లో జరిగే పరిణామాలపై మంచి పట్టుంది. ముఖ్యంగా ఆయన జమ్ముకశ్మీర్, ఈశాన్య భారత్, వామపక్ష తీవ్రవాదంపై పనిచేశారని సమాచారం.
తాజావార్తలు
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!