ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఛత్తీస్‌గఢ్‌లోని రాయగఢ్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా.. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పేదలకు పథకాలు అమలు చేయడంలో కాంగ్రెస్ వెనుకబడి ఉండొచ్చు కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం స్కామ్‌లలో చాలా ముందుందని తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఇద్దరు అక్కాచెల్లెళ్లు రక్షాబంధన్ జరుపుకుని తిరిగి వస్తుండంగా సామూహిక అత్యాచారానికి గురయ్యారు.
దేశంలో రక్షాబంధన్ వేడుకల సందడి ప్రారంభమైంది. తోడబుట్టినవారికి జీవితాంతం అండగా ఉంటానని సోదరులు హామీ ఇచ్చే రోజు ఇది. అయితే, ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో సోదరుడికి ఓ సోదరి అరుదైన రక్షాబంధన్ కానుక ఇచ్చింది.
ఛత్తీస్‌గఢ్‌లోని ధామ్తరి జిల్లా ఏక్వారీ అడవుల్లో భద్రతా బలగాలు-మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్ లో పోలీసులు ఓ నక్సలైట్ ను హతం చేశారు. గంటల తరబడి ఈ కాల్పులు కొనసాగాయి. మరోవైపు ఘటనా స్థలం నుంచి పోలీసులు రెండు రైఫిళ్లు, మావోయిస్టులు ఉపయోగించే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లా మట్ బేడ అటవీ ప్రాంతంలో సోమవారం భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక మావోయిస్టు హతమయ్యాడు.
ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కత్తితో దాడి జరిగింది. రాజ్‌నంద్‌గావ్ జిల్లాలో ఆదివారం ఓ వ్యక్తి కత్తితో దాడి చేయడంతో మహిళా కాంగ్రెస్ ఎమ్మెల్యే గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
ఛత్తీస్‌గఢ్‌లో రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలు పార్టీలు ఇప్పటికే ప్రచార జోరును పెంచాయి. ఛత్తీస్‌గఢ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అడుగుపెట్టాలని జోరుగా అడుగులు వేస్తోంది. ఆ రాష్ట్రానికి ఆప్ వరాల జల్లు కురిపించింది.
చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో తన సర్వీస్ రైఫిల్‌తో కాల్చుకుని సీఆర్పీఎఫ్లోని జంగిల్ వార్ఫేర్ యూనిట్ కోబ్రా(కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్) ఇన్స్పెక్టర్ శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు ఆత్మహత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ఛత్తీస్‌గఢ్‌లోని ఉక్కు ఫ్యాక్టరీలో ఆదివారం పేలుడు సంభవించి కార్మికుడు కాలిపోయి ప్రాణాలు కోల్పోయాడు. రస్మారాలోని రాయ్‌పూర్ స్టీల్ ప్లాంట్‌లో స్టీల్‌ను కరిగించే పని జరుగుతుండగా పేలుడు సంభవించింది.
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో శనివారం భద్రతా సిబ్బంది, నక్సలైట్ల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఆ స్థలంలో మృతదేహాలు ఏవీ కనుగొనబడనప్పటికీ దాదాపు నాలుగు నుంచి ఆరుగురు నక్సలైట్లు మరణించారని సమాచారం.