ఛత్తీస్‌గఢ్‌లో రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలు పార్టీలు ఇప్పటికే ప్రచార జోరును పెంచాయి. ఛత్తీస్‌గఢ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అడుగుపెట్టాలని జోరుగా అడుగులు వేస్తోంది. ఆ రాష్ట్రానికి ఆప్ వరాల జల్లు కురిపించింది.
ఛత్తీస్‌గఢ్‌లో 2018లో కాంగ్రెస్ చేతిలో ఓడిపోవడానికి ముందు 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ.. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం మేనిఫెస్టోను రూపొందించేందుకు 31 మంది సభ్యులతో కూడిన ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది.