చేవెళ్ల లోక్సభ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తనదైన శైలిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా.. ఆయన చేవెళ్ల ప్రాంతానికి ప్రత్యేకంగా ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించి శుక్రవారం విడుదల చేశారు. తనను గెలిపించడం ద్వారా.. నియోజకవర్గ ప్రజలకు రాబోయే ఐదేళ్లలో చేయనున్న పనులను సంకల్ప పత్రం పేరిట ప్రజల ముందుకు తీసుకొచ్చారు. చేవెళ్ల నియోజకవర్గంలోని మొయినాబాద్ మండలం అజీజ్ నగర్లోని బీజేపీ కార్యాలయంలో ఆయన ఈ సంకల్ప పత్రాన్ని మీడియాకు వివరించారు. చేవెళ్లను దేశంలో…