చెస్ దిగ్గజం గ్యారీ కాస్పరోవ్‌ను రష్యా ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ మేరకు వ్లాదిమిర్ పుతిన్ సర్కార్ ఓ ప్రకటన రిలీజ్ చేసింది. కాస్పరోవ్ పుతిన్ సర్కార్ పై బహిరంగంగా తీవ్ర విమర్శలు చేశాడు. అందు కారణంగా ఆయన్ను 'ఉగ్రవాదులు, తీవ్రవాదులు' జాబితాలో చేర్చినట్లు రష్యా మీడియా తెలిపింది.