ఒకప్పుడు భర్తే పత్యక్షదైవం ఆడవారికి. భర్త మాటవేదం. భర్త కొట్టిన తిట్టిన భరించి తనతోపాటు చితిలో సైతం ప్రాణాలు వదలడానికి సిద్దపడేవారు ఆడవారు. కానీ.. రాను రాను కొంతమార్పులు వచ్చాయి. భర్త భార్యను వేధిస్తే ఇప్పుడు చాట్టాలు వచ్చాయి. అంతేకాదు.. కొందరు భర్తలు గృహ హింసకు పాల్పడుతుండటం.. భార్యలపై పలు ఘాతకానికి పాల్పడుతుండటంతో .. చట్టాలరూపంలో వారికి శిక్షించే విధంగా సెక్సెన్లు కూడా అమలు అవుతున్నాయి.
వేద మంత్రాల సాక్షిగా జీవితాంతం పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటా అంటూ ప్రమాణం చేసిన భర్తల నుంచి వేధింపులు ఎదురైతే వారి బాధలు ఎవరికి చెప్పుకోవాలి అంటూ ఇలాంటివి.. భర్త భార్యను వేధించి నప్పుడు మనం చదివే మ్యాటర్స్. అదే భర్తను భార్యను వేధిస్తే. ఏంటి ఇలాంటి కూడా వుంటాయా అనుకుంటాం. భర్తే ప్రత్యక్షదైవంగా అనుకునే భార్యలు వున్న మనదేశంలో భర్తలపై అజమాయిషీ చేసే భార్యలు కూడా వుంటారనడం ఈఘటనే నిదర్శం. దేశంలో ఎక్కడ చూసిన భార్యను వేధించిన దాఖలాలే మనకు ఎక్కువ కనిపిస్తుంటాయి. దీనికి విరుద్దంగా భర్తను వేధించే భార్యలు కూడా ఉంటారు అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి. అలాంటిదే ఓఘటన చెన్నై లోని సుచింద్రం గ్రామంలో జరిగింది.
కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్ సమీపంలోని సుచింద్రం గ్రామంలో జయప్రకాశ్ కుటుంబం నివాశముంటున్నారు. అతను ఆర్మీజవాన్ గా పనిచేసేవాడు. 2014 సంవత్సరంలో జయప్రకాశ్ రిటైడ్ అయ్యాడు. గత కొన్నేళ్లుగా బ్యాంకు ఏటీఎంలలో నగదు నింపే వ్యాన్‌లో సెక్యూరిటీ గార్డుగా జయప్రకాశ్ పనిచేస్తున్నాడు.
అయితే.. గత కొద్దిరోజులుగా భార్య జయమ్మాల్ , జయప్రకాశ్ ల మధ్య గొడవలు మొదలయ్యాయి. అయినా తనేమి చెప్పకుండా సర్దుకుంటూ పోయేవాడు. కానీ ఈ మధ్య గొడవలు ఎక్కువ కావడంతో మనస్తాపానికి లోనైన జయప్రకాశ్ తన గన్ తో తలపై కాల్చుకుని, ప్రాణాలు వదిలాడు. దీంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. పెళ్ళైన నాటినుంచి ఇదే తంతుగా భార్య.. భర్తపై ఎప్పుడు గొడవచేసేదని, అది తట్టుకోలేకే తను ఆత్మహత్యకు పాల్పడ్డాని స్థానికులు, కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
Actor Banerjee: చిరంజీవి బయోపిక్‌పై నేనలా అనలేదు