టాలెంట్ ఉంటే అన్నీ మనకు దాసోహం అంటాయి అని చాలా మంది నిరూపించారు.. వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది తమలోని అద్భుతమైన టాలెంట్ ను బయట పెడుతున్నారు.. ఈ మధ్య ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో తెగ వినిపిస్తున్నాయి.. తాజాగా ఓ బుడ్డోడు తన టాలెంట్ ను బయట పెట్టి అందరిని ఆశ్చర్య పరిచాడు.. ఆ బుడ్డోడు గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఆ బుడ్డోడు పేరు దేవసుగన్ వయస్సు ఏడేళ్లు.. తాళ్లలో కారు లాగే సాధనలో రికార్డుల్లోకి ఎక్కాడు.. ఈ ఘటన చెన్నై లో వెలుగు చూసింది.. శివగంగ జిల్లాకు చెందిన మోహన్‌రాజ్, మారీశ్వరి దంపతుల కుమారుడు దేవసుగన్.. వివరాల్లోకి వెళితే.. ఆళియారు అరివుతిరుక్కోయిల్ సమీపం వాల్పారై రోడ్డులో నడుముకు తాళ్లు కట్టుకొని కారు లాగి చోళన్ ప్రపంచ రికార్డ్స్‌లో పేరు నమోదు చేసుకున్నాడు. 2 నిమిషాల 47 సెకన్లలో 220 మీటర్ల దూరానికి 900 కిలోల బరువు కలిగిన కారును లాగాడు.. బుడ్డోడి ధైర్యాన్ని అందరు మెచ్చుకున్నారు..
అతి చిన్న వయస్సులో అంత పెద్ద కారును లాగడం తో స్థానికులు అతన్ని అభినందించారు.. అతనిపై ప్రశంసలు కురిపించారు.. ఇక ఈ విషయం పై బాలుడి తల్లి తండ్రులు మాట్లాడుతూ.. బాలుడు రెండో తరగతి చదువు తున్నప్పుడే అతను కారును 200 మీటర్లు లాగినట్లు చెప్పారు.. తనకు చిన్న వయస్సు నుంచే శిక్షణ ఇప్పిస్తున్నట్లు చెబుతున్నారు..