Kedarnath Dham: కేదార్ నాథ్ ధామ్ పోర్టల్ ను భక్తులందరకీ ఏప్రిల్ 25న తెరవనున్నట్లు అధికారులు ఈ రోజు తెలిపారు. ఏప్రిల్ 25 నుంచి ఈ కేధార్ నాథ్ యాత్ర ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. భక్తులు కాలినడకతో పాటు హెలికాప్టర్ ద్వారా కేదార్ నాథ్ ధామ్ చేరుకోవచ్చని అధికారులు తెలిపారు. కేదార్‌నాథ్ ధామ్‌కు హెలికాప్టర్‌లో ప్రయాణించే యాత్రికుల సౌకర్యార్థం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ఆన్‌లైన్ బుకింగ్ సదుపాయాన్ని కల్పించనుంది.
Despite heavy rainfalls in the holy region of Kedarnath in the Rudraprayag district of Uttarakhand, the journey to the world-famous sacred Dham resumed on Tuesday.
చార్‌ధామ్ యాత్రలో పెను విషాదం చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్‌లో భక్తులతో వెళుతున్న ఓ బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 22 మంది మృతి చెందారు. దమ్తా ప్రాంతంలో యమునోత్రి జాతీయ రహదారి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 28 మంది ఉన్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 22 మృతదేహాలు లభ్యమయ్యాయి. గాయపడిన మిగతా ఆరుగురిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం ఘటనా స్థలంలో సహాయక చర్యలు…
కేదార్‌నాథ్ ఆలయంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. నోయిడాకు చెందిన వికాష్ త్యాగి (33) అనే వ్యక్తి తన పెంపుడు కుక్కను కేదార్‌నాథ్ ఆలయంలోకి తీసుకువెళ్లాడు. అతడు తన పెంపుడు కుక్కతో నవాబ్ ఆలయ వెలుపల ఉన్న నంది విగ్రహాన్ని తాకాడు. అంతటితో ఆగకుండా తన పెంపుడు కుక్కకు పూజారితో తిలకం దిద్దించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై బద్రీనాథ్-కేదార్ నాథ్ ఆలయ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది.…
కరోనా మహమ్మారి కారణంగా నిలిపివేసిన చార్‌ధామ్ యాత్ర తిరిగి ప్రారంభం అవుతోంది.. ఇవాళ్టి నుంచి చార్‌ధామ్ యాత్రకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.. ఇదే సమయంలో.. కరోనా కేసులు ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రాకపోవడంతో నిబంధనలు కూడా విధించింది.. ముఖ్యంగా కోవిడ్ కేసులు అధికంగా వెలుగుచూస్తున్న.. కేరళ, ఏపీ.. లాంటి రాష్ట్రాలకు చెందినవారిపై ప్రత్యేక ఆంక్షలు పెట్టింది.. నైనిటాల్ హైకోర్టు నిషేధం ఎత్తివేసిన తర్వాత చార్‌ధామ్ యాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం.. అయితే, కోవిడ్…
ఉత్తర భారత దేశంలో ప్రసిద్ది చెందిన యాత్రల్లో ఒకటి ఛార్‌ధామ్ యాత్ర. ఈ యాత్రకు ప్రతి ఏడాది లక్షలాదిమంది యాత్రికులు వస్తుంటారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది యాత్రను రద్ధు చేసింది ప్రభుత్వం. అయితే, ఛార్‌ధామ్ యాత్రకు చుట్టుపక్కల ఉన్న మూడు జిల్లాలకు చెందిన యాత్రికులు యాత్ర చేస్తుంటారు. అయితే, ఈ ఏడాది చమోలీ, రుద్రప్రయాగ్, ఉత్తర కాశీ జిల్లాకు చెందిన ప్రయాణికులు యాత్ర చేసేందుకు అనుమతిని నిరాకరించింది.…