ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలోని పవిత్ర ప్రాంతమైన కేదార్‌నాథ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పవిత్ర ధామ్ యాత్ర మంగళవారం తిరిగి ప్రారంభమైంది. వర్షం కారణంగా కేదార్‌నాథ్‌కు వెళ్లే భక్తుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. వర్షం, వరదలతో కూడిన రోడ్లు ఉన్నప్పటికీ యాత్రికులు బాబా కేదార్‌నాథ్ ఆలయానికి తమ ప్రయాణాన్ని ఉత్సాహంగా కొనసాగిస్తున్నారు. ఈ ప్రాంతంలో పొగమంచు కమ్ముకోవడంతో కేదార్‌నాథ్ పట్టణం మొత్తం చలికి వణుకుతోంది. కురుస్తున్న వర్షాల మధ్య, రుద్రప్రయాగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రయాణికుల భద్రత గురించి ఆరా తీసేందుకు సురక్షితమైన ప్రదేశాల్లో వారిని నిలిపివేసింది. రాష్ట్రంలో రుతుపవనాల కారణంగా యాత్రికుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది.
గత నెలలో రోజుకు 8 నుంచి పది వేల మంది ప్రయాణికులు వచ్చేవారు. కానీ ప్రస్తుతం ధామ్‌కు కేవలం 2 నుంచి 3 వేల మంది యాత్రికులు మాత్రమే ప్రయాణిస్తున్నట్లు సమాచారం. జులై 12న ఉత్తరాఖండ్‌లో ఉరుములు,మెరుపులతో కూడిన భారీ వర్షపాతం కురవగా.. జులై 13న కూడా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అంతకుముందు శనివారం ఉత్తరాఖండ్‌లోని సోన్‌ప్రయాగ్‌లో భారీ వర్షాల కారణంగా నెలకొన్న భయం నేపథ్యంలో యాత్రికుల భద్రతను నిర్ధారించడానికి కేదార్‌నాథ్ యాత్రను నిలిపివేశారు. తిరిగి ఈ రోజు మళ్లీ ప్రారంభించారు.
Kaleshwaram Project : నిండుకుండలా కాళేశ్వరం ప్రాజెక్ట్
కేదార్‌నాథ్ యాత్ర హిమాలయాలలోని ఛార్‌ధామ్ యాత్రగా పిలువబడే నాలుగు తీర్థయాత్రలలో ఒకటి. ఇక్కడ లక్షల మంది యాత్రికులు కేదార్ బాబా ఆలయాన్ని సందర్శిస్తారు. ఇతర మూడు పుణ్యక్షేత్రాలు యమునోత్రి, గంగోత్రి మరియు బద్రీనాథ్. నాలుగు ప్రదేశాలు – యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ – కలిపి చార్‌ధామ్ యాత్రను రూపొందించారు.