ఉత్తర భారత దేశంలో ప్రసిద్ది చెందిన యాత్రల్లో ఒకటి ఛార్‌ధామ్ యాత్ర. ఈ యాత్రకు ప్రతి ఏడాది లక్షలాదిమంది యాత్రికులు వస్తుంటారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది యాత్రను రద్ధు చేసింది ప్రభుత్వం. అయితే, ఛార్‌ధామ్ యాత్రకు చుట్టుపక్కల ఉన్న మూడు జిల్లాలకు చెందిన యాత్రికులు యాత్ర చేస్తుంటారు. అయితే, ఈ ఏడాది చమోలీ, రుద్రప్రయాగ్, ఉత్తర కాశీ జిల్లాకు చెందిన ప్రయాణికులు యాత్ర చేసేందుకు అనుమతిని నిరాకరించింది. అనుమతి ఇవ్వడాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. జూన్ 16 తరువాత ఈ యాత్రపై నిర్ణయం తీసుకోనున్నారు.