Natty Kumar: ఇండియాకు ఆస్కార్ వచ్చింది అని సంతోషిలోపే.. ఆ ఆస్కార్ ను అడ్డం పెట్టుకొని రాజకీయాలు నడుపుతున్నారు కొంతమంది. అంత పెద్ద గొప్ప అవార్డును తీసుకొచ్చిన వారికి ఏ రేంజ్ లో సన్మానించాలి అనేది అందరికి తెలిసిందే.
ఆస్కార్ విజేత చంద్రబోస్ ను తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఛైర్మన్ ఆర్.కె. గౌడ్ సత్కరించారు. త్వరలో దుబాయ్ లో జరుగబోతున్న టి.ఎఫ్.సి.సి. నంది అవార్డుల వేడుకకు చంద్రబోస్ ను ఈ సందర్భంగా ఆహ్వానించారు.
సినీ సంగీత రంగంలో 25 యేళ్ళు పూర్తి చేసుకున్న ఏకైక మహిళా సంగీత దర్శకురాలు MM శ్రీలేఖ ఇంటికి ఆస్కార్ వచ్చింది. ఇటీవలే ప్రపంచ యాత్ర మొదలుపెట్టిన శ్రీలేఖకి ఆస్కార్ రావడంతో సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. RRR సినిమాలో నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డ్ అందుకున్న రచయిత చంద్రబోస్ గారు తనకు మొట్ట మొదటి అవకాశం ఇచ్చిన శ్రీలేఖ కు గురుదక్షిణగా ఇంటికి వచ్చి మరీ ఆస్కార్ అందించి అభినందనలు తెలిపారు. ఆస్కార్ తనకే వచ్చినంత ఆనందంగా…
Lyricist Chandrabose : ఆస్కార్ అందుకున్న తరువాత తొలిసారి హైదరాబాద్ కి లిరిసిస్ట్ చంద్రబోస్ హైదరాబాదు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఆయన సన్నిహితులు చంద్ర బోస్ కి ఘన స్వాగతం పలికారు.
దేశవ్యాప్తంగా దుమ్ములేపిన నాటు నాటు ఆస్కార్ సాధించింది. దీంతో తెలుగు సినిమా సత్తా ప్రపంచానికి తెలిసింది. ఆస్కార్ లో నాటు నాటు పాట తో ఊపు వచ్చింది. ఆస్కార్ వేదిక పైన ఈ పాటకు డాన్స్ చేశారు. 'బెస్ట్ ఒరిజినల్ సాంగ్' విభాగంలో ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ లభించింది.
తెలుగు చలనచిత్ర ఖ్యాతిని RRR చిత్రం విశ్వవ్యాప్తం చేసిందని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం తరుపున RRR బృందానికి సన్మానం చేయాలని నిర్ణయించామని తెలిపారు.
Walter veerayya: సంక్రాంతి కానుకగా చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' సినిమాతో సందడి చేయబోతున్నాడు. ఈ చిత్రంలోని టైటిల్ సాంగ్ ఇటీవల విడుదలై అభిమానులను విశేషంగా అలరిస్తోంది. ఈ గీతాన్ని దేవిశ్రీ ప్రసాద్ బాణీలకు అనుగుణంగా ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ రాశారు.