Oscar: చంద్రబోస్ ని సన్మానించిన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ చైర్మన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RRR: “నాటు నాటు” పాటకు అందించిన సాహిత్యానికి గాను ఆస్కార్ అవార్డు గెలిచి తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన గీతరచయిత చంద్రబోస్‌ని ఆయన నివాసంలో ఘనంగా సన్మానించారు తెలంగాణా ఫిల్మ్ ఛాంబర్ చైర్మన్, లయన్ డా. ప్రతానిరామకృష్ణగౌడ్ . ఈ సందర్భంగా దుబాయ్‌లో జరగనున్న టిఎఫ్‌సిసి నంది అవార్డుల వేడుకకు చంద్రబోస్‌గారిని ఆత్మీయంగా ఆహ్వానించారు. దుబాయ్ వేదికపై అక్కడి దుబాయ్ ప్రిన్స్ చేతుల మీదుగా చంద్రబోస్ కి టిఎఫ్‌సిసి నంది అవార్డు అందించనున్నారు. ఈ సందర్భంగా రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ, “చంద్రబోస్‌గారితో నాకు ఎప్పటినుంచో మంచి అనుబంధం ఉంది. నేను నిర్మించి దర్శకత్వం వహించిన ”జోడి నెంబర్.1, సర్దార్ పాపన్న”తో పాటు పలు చిత్రాలకు ఆయన సాహిత్యాన్ని అందించారు. తన సాహిత్యంతో ఆస్కార్ గెలుచుకుని తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన చంద్రబోస్‌గారికి నా హృదయపూర్వక అభినందనలు” అని అన్నారు.
ఈ సందర్భంగా చంద్రబోస్ మాట్లాడుతూ… “సంపూర్ణ భారతీయ చిత్రానికి వచ్చిన మొట్ట మొదటి ఆస్కార్ పురస్కారమిది. అది మన తెలుగుకి, నేను రాసిన పాటకి రావడం మరింత ఆనందంగా ఉంది. ఇది మాటల్లో వర్ణించలేని అనుభూతి . స్వప్నంలో కూడా స్వప్నించని స్వప్నం ఇది. ఈ పాట రాసేటప్పుడు కీరవాణి గారు, రాజమౌళి గారు మెచ్చుకుంటే చాలు… ఆ తర్వాత ప్రజలు ఆదరిస్తే చాలు అనుకున్నా. కానీ ఆస్కార్ అవార్డ్ రావడం ఎంతో సంతోషం. ఒక జాతీయ పురస్కారం వస్తే చాలు అదే ఈ జన్మకు సార్థకత అనుకునే వాణ్ని. అలాంటిది నాలుగు అంతర్జాతీయ పురస్కారాలు ఇవ్వడంతో నా జన్మ ధన్యమైంది. చాలా ఆనందంగా ఉంది. అందులో తెలుగు పాటకు ఆస్కార్ వచ్చినందుకు, తెలుగు వారి శక్తి సామర్థ్యాలు విశ్వ వేదికపై చాటి చెప్పినందుకు మరింత ఆనందంగా ఉంది. ఈ పాటలో ప్రతి వాక్యం నా భార్య జ్ఞాపకాలు. మా ఊళ్లో నేను అనుభవించిన జీవితం, నా నేపథ్యం, నా పరిసరాలు, నా కుటుంబం… వీటన్నింటిని కలిపి ‘నాటు నాటు..’ పాటగా రాశాను. ఇక తెలంగాణా ఫిల్మ్ ఛాంబర్ తరపున నన్ను సన్మానించిన ఆర్.కె. గౌడ్ గారికి, ఛాంబర్ సభ్యులందరికి ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. త్వరలో దుబాయిలో జరిగే టి యఫ్ సి సి నంది అవార్డుల వేడుకకు నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు” అని అన్నారు.
Also Read
- Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
- Hatha Teaser: కిరణ్ అబ్బవరం బ్యానర్లో కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్గా ‘హతః’ టీజర్! చూశారా
- “ఎంత మాయగాడివయ్యా!” డైరెక్టర్ వశిష్ట పోస్ట్.. ‘Vishwambhara’ గురించేనా?
- Nani: నా సినిమాలకు ఆ ట్యాగ్ వద్దు.. కుండబద్దలు కొట్టిన న్యాచురల్ స్టార్!
తాజావార్తలు
-
Danam Nagender : ఎమ్మెల్యేగా అనర్హత వేటుపై దానం నాగేందర్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
-
West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
-
Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
-
Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
-
Travis Head-Abhishek: కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఇటు అభిషేక్, అటు ట్రావిస్ హెడ్.. బాదుడే బాదుడు..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..