నేడు సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటన సందర్భంగా కపిలేశ్వరస్వామి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య కార్మికులు ధరించే సూట్‌ని ధరించారు. కాగా.. తిరుపతిలో నిర్వహించిన ప్రజా వేదిక కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధికి ఒక్కో నెల ఒక్కో కార్యక్రమాన్ని చేపట్టినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రం బాగుండాలంటే అందరూ స్వచ్ఛత పాటించాలని పిలుపునిచ్చారు.
కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అమరావతి రాజధాని పనుల పున:ప్రారంభ కార్యక్రమం విజయవంతమవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రగతికి మద్ధతుగా నిలుస్తామన్న ప్రధాని వ్యాఖ్యలు మరింత నమ్మకాన్ని నింపాయన్నారు. ప్రజలందరి భాగస్వామ్యంతోనే సభ సక్సెస్ అయిందని వ్యాఖ్యానించారు. సభ నిర్వహణకు సమస్త ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పని చేసిందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం పరిపాలన ప్రారంభించిన నేపథ్యంలో తొలిసారిగా మంత్రివర్గం సమావేశం కానుంది. నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న కేబినెట్ సమావేశంలో ప్రభుత్వ ప్రాధాన్యతలపై సీఎం చంద్రబాబు తన మంత్రివర్గ సహచరులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంలో వాగ్దానాల అమలు, రాష్ట్ర రాజధాని, పోలవరం ప్రాజెక్టు తదితర అంశాలపై చర్చించనున్నారు. ఎనిమిది శాఖలకు సంబంధించిన శ్వేతపత్రాలు విడుదలపై కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకునే…
బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో యువతి హత్యకు గురైన ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఘటనలో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో పోలీసులు కేసును ప్రతిష్టాత్మకంగ తీసుకున్నారు. ఐదు ప్రత్యేక బృందాలతో నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 48 గంటల్లో కేసును ఛేదించేందుకు కసరత్తు చేస్తున్నారు.హోంమంత్రి వంగలపూడి అనిత సంఘటనా స్థలాని పరిశీలించారు. బాధిత కుటుంబాన్ని కలిసి ప్రభుత్వం అండగా ఉంటుంది అని హామీ ఇచ్చారు…
AP Cabinet: ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కూర్పులో మరోసారి తన మార్కుని ప్రదర్శించారు సీఎం చంద్రబాబు నాయుడు. ఏపీ మంత్రివర్గంలో మొత్తం 24 మంత్రి స్థానాలకు ఏకంగా 17 మందిని కొత్తవారికి అవకాశం ఇచ్చారు. జనసేనకు 3, బీజేపీకి 1 మంత్రి పదవి ఇచ్చిన మిగిలినవి టీడీపీ వారికీ కట్టబెట్టారు. అయితే మంత్రివర్గంలో చోటు దక్కుతుంది అనుకున్న సీనియర్ నాయకులకు చేదు అనుభవం ఎదురయ్యింది. కన్ఫర్మ్ సీట్స్ వస్తాయి అనుకున్న వాళ్ళ అందరకి ఈ సరి బెర్త్ దక్కలేదు.…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడి ప్రమాణ స్వీకార మహోత్సవం కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో జూన్ 12న ఉదయం 11:27 గంటలకు జరగనుంది. ప్రధాని మోదీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు హాజరవుతారు. మూడు ప్రత్యేక గ్యాలరీలతో సహా వేదిక చుట్టుపక్కల 65 ఎకరాల్లో పార్కింగ్, భారీ వర్షాలకు రెయిన్ ప్రూఫ్ షెడ్లు, ఎల్‌ఈడీ తెరలు, పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ఇంత సమాచారం కొరకు…
ఆంధ్రప్రదేశ్ సీఎం ప్రమాణ స్వీకారానికి ముందే పని ప్రారంభించి కృషి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. పలు కీలక అంశాలపై సమాచారం అందుకున్న ఆయన, ప్రజాసంబంధాలు నిలబెట్టేందుకు అధికారులకు ఆదేశాలు జారీచేశారు. వీధిదీపాలు, నీటి సరఫరా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామాలు, నగరాల్లో పరిస్థితులను మెరుగుపరచాలని సూచించారు. విజయవాడలో నీరు కలుషితమై మరణాలు సంభవించడంతో, నీటి సరఫరాలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరలుకొరకు కింది వీడియో చుడండి.
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని నాల్గవసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. అంతే కాకుండా లోకసభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరువాత అతి పెద్ద పార్టీగా అవతరించింది టీడీపీ పార్టీ . కానీ కేబినెట్ సీటుపై పూర్తిగా దృష్టి సారించలేకపోయారు. ఎవరు మంత్రులు అవుతారనే చర్చ జరుగుతోంది. పార్టీ పెద్దలలో మరో చర్చ కూడా నడుస్తోంది. గడచిన ఐదేళ్లలో పార్టీ కోసం పని చేసిన వారికి పెద్దపీట వేస్తారా లేక కేసులు ఎదుర్కొన్న, జైలుకు వెళ్లిన వారికి ప్రాధాన్యం…
2024 లోక్‌సభ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ (జెఎస్‌పి), బిజెపి తో పొత్తు పెట్టుకున్నా, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ఆంధ్రప్రదేశ్‌లో ఒంటరిగా 16 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. మొత్తం 25 ఎంపీ స్థానాల్లో, టీడీపీ, బీజేపీ, జనసేనతో కూడిన ఎన్డీఏ కూటమి 21 స్థానాలను కైవసం చేసుకుంది. కేంద్ర మంత్రివర్గంలో టీడీపీకి రెండు కేబినెట్ సీట్లు ఖరారయ్యాయి. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు క్యాబినెట్ మంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ సహాయ…