Lokesh Balakrishna : నటసింహ బాలకృష్ణ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కల్మషం లేని మనసు తనది. అంతేకాకుండా తన దీవెనలో ఎంతో స్పెషాల్టీ ఉంటుంది. నిండైన మనస్సుతో తనకన్నా చిన్న వాళ్లను, తనకు బాగా నచ్చిన వాళ్లు, కావాల్సిన వాళ్లు తారస పడితే దీవించకుండా ఉండరు. తలమీద కుడి చేయి పెట్టి దీవించి పంపిస్తుంటారు. ముఖ్యంగా తన కుటుంబ సభ్యులను ఈ విషయంలో మాత్రం విడిచి పెట్టరు. తప్పుకుండా బాలయ్య దీవెన ఉండాల్సిందే.
తాజాగా మామ – పెద్దల్లుడు వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఓ ఈవెంట్ లో బాలకృష్ణ-లోకేష్ తారస పడ్డారు. బాలయ్య కారు దిగి లోపలికి వెళ్లి బయటకు వస్తోన్న సమయంలో మంత్రి లోకేష్ కనిపిస్తారు. దీంతో వెంటనే బాలయ్య బాబు లోకేష్ ని దీవించారు. తొలుత లోకేష్ పరజ్ఞానంలో ఉంటారు. ఆ తర్వాత మామ చేయి ఎత్తడం చూసి వెంటనే తల కిందకు దించి దీవెన అందుకున్నారు. ఆ తర్వాత బాలయ్య వెనుక వెళ్లి మామయ్య కారు దగ్గరుండి మరీ ఎక్కించారు.
తన మామగారు నందమూరి బాలకృష్ణ అంటే నారా లోకేష్ అంటే చాలా గౌరవం అన్న విషయం తెలిసిందే. పబ్లిక్ ఫోరమ్‌లలో బాలయ్యను “మావయ్య” అని ముద్దుగా పిలుచుకుంటాడు. అతని గురించి గొప్పగా మాట్లాడతాడు. ఈరోజు హైదరాబాద్‌లోని ఓ కన్వెన్షన్ సెంటర్‌లో నారా రోహిత్ నిశ్చితార్థం వేడుకలో లోకేష్, బాలయ్య ఒక్కటయ్యారు. బయటకు వెళ్లే సమయంలో బాలయ్య, లోకేష్‌లు ఉన్న ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. ఈ వైరల్ వీడియో బాలయ్య తన అల్లుడు నారా లోకేష్‌ను ఆశీర్వదించడం కనిపిస్తుంది. బాలయ్య బెంట్లీ కారు వైపు నడుస్తూ లోకేష్‌ని పంపడం కూడా కనిపిస్తుంది.