అసలు పవన్ కల్యాణ్ కామెంట్లల్లో తప్పేం లేదు అన్నారు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు.. టీడీపీ-జనసేన మధ్య సీట్ల సర్దుబాటు చాలా వరకు ఫైనల్ అయ్యాయని తెలిపారు. పవన్‌కు కొన్ని సీట్లు ప్రకటించాలని ఉంది.. ప్రకటించారు. జనసేన పోటీ చేసే సీట్లనే పవన్ ప్రకటించారన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.. అందులో భాగంగా త్వరలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లనున్నారు.. పొత్తుల విషయంలో బీజేపీతో క్లారిటీ తీసుకోనున్నారు. పొత్తులపై బీజేపీ అధిష్టానంతో మంతనాలు జరపనున్నారు.. ఇక, పవన్ కల్యాణ్‌తో భేటీ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.
కోవర్టు నాని ఊసరవెల్లి.. లాగా బిహేవ్ చేస్తున్నాడని కేశినేని నానిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అబ్బా కొడుకులు అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఆయారం... గాయారం టైప్ అని.. తిన్నింటి వాసాలు లెక్కపెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో కట్టిన ప్రతి ఫ్లై ఓవర్ చంద్రబాబు కట్టించిందేనని తెలిపారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవాలయం ఫ్లై ఓవర్ కట్టడానికి తనకు సంబంధించిన సోమా కంపెనీకి ఇవ్వకపోతే ఇబ్బంది పెట్టాడని.. చంద్రబాబు…
జీవన్ రెడ్డి గారు మీ వైఖరి ఎక్కువ రోజులు నిలబడదు.. కవిత కౌంటర్ జీవన్ రెడ్డి గారు మీ వైఖరి ఎక్కువ రోజలు నిలబడదు ప్రజలు తిరగబడతారని ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. జగిత్యాల రూరల్ మండలం హబ్సిపూర్ సర్పంచ్ ని జగిత్యాల జైలులో కవిత పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. హబ్సిపూర్ సర్పంచ్ పై కక్షపూరితంగా వ్యవహరించి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కేసు పెట్టించారని మండిపడ్డారు. జగిత్యాలలో 30 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి ఎమ్మెల్యే సంజయ్ చేశారని…
భవిష్యత్తును మార్చుకునేందుకు రాజ్యాంగం కల్పించిన అవకాశం ఓటు హక్కు అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పాలకులను ప్రశ్నించే అధికారం ఇచ్చేది ఓటు అని పేర్కొన్నారు. రాతియుగం నుంచి స్వర్ణయుగం వైపు మిమ్మల్ని నడిపించేది.. మంచి సమాజాన్ని నిర్మించేది ఓటు అని తెలిపారు. ఇప్పుడు రాష్ట్రంలో కొత్తగా ఓట్ల దొంగలు వచ్చారని.. ఓటు దొంగలు ఓటు తీసేస్తారని .. లేదా మార్చేస్తారు.. నకిలీ ఓట్లు చేర్చేస్తారని ధ్వజమెత్తారు.
మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలం ఉరుకుంద గ్రామంలో మంత్రాలయం తెలుగుదేశం పార్టీ బాధ్యులు పాలకుర్తి తిక్కరెడ్డి, ఉరుకుంద(ఈరన్న) లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం నాగరాజు స్వామి సేవా సంఘం హాల్ నందు జరిగిన జయహో బీసీ కార్యక్రమంలో పాల్గొని పాలకుర్తి తిక్కరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలు పార్టీకి వెన్నెముక లాగా ఉన్నారని, బీసీల పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ, బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు పెంచి, బీసీ సబ్ ప్లాన్,…
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు బెయిల్ ఇవ్వడంపై ఏపీ ప్రభుత్వం మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు బెయిల్‌ను సుప్రీంలో ఏపీ ప్రభుత్వం సవాలు చేసింది.