కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మరోసారి చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. ప్రభుత్వాన్ని ఎలా విమర్శించాలని మాజీ ఎమ్మెల్యే కొండబాబు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు… గోతికాడ నక్కల్లా కాచుకు కూర్చున్నారని మండిపడ్డారు. 2014 ఎన్నికలకు ముందు డ్వాక్రా రుణాలు, గృహ రుణాలు మాఫీ చేస్తామని ప్రజలను మోసం చేశారని చంద్రబాబు పై ఫైర్ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు మోసం చేసేందుకు ప్రజల్లోకి వస్తున్నారని ఆగ్రహించారు. వీరి మోసాలపై కరపత్రాలను విడుదల చేస్తున్నానని…వచ్చే ఎన్నికల్లో టీడీపీలో కొండబాబుకు…
ఇటీవల ఎన్నికలు జరిగిన కొండపల్లి, జగ్గయ్యపేట మున్సిపాల్టీల ఫలితాలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఎన్నికల్లో పోటీ చేసినా, పని చేసిన కార్యకర్తలు, నేతలకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. కొండపల్లి ఎన్నికల్లో ఎంపి కేశినేని పాత్రపై చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. నేతలను, కార్యకర్తలను ఎంపి నాని బాగా కో-ఆర్డినేట్ చేశారన్న బాబు… సమర్థులైన వారికి కొన్ని చోట్ల అవకాశం ఇవ్వకపోవడం వల్ల నష్టం జరిగిందన్నారు. జగ్గయ్యపేటలో టీడీపీ సాంకేతికంగా ఓడినా.. నైతికంగా గెలిచిందన్నారు చంద్రబాబు. అయితే ఇకపై నియోజకవర్గ…
తెలుగు సినిమా గేయరచయిత శ్రీ చేంబోలు సీతారామశాస్త్రి పరమపదించారని తెలిసి ఎంతో విచారించాను. తొలి సినిమా సిరివెన్నెల పేరునే ఇంటి పేరుగా మార్చుకుని తెలుగు భాషకు పట్టం కడుతూ వారు రాసిన విలువలతో కూడిన ప్రతి పాటనూ అభిమానించే వారిలో నేను కూడా ఒకణ్ని. సీతారామశాస్త్రి అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారని తెలిసి కిమ్స్ వైద్యులతో ఫోన్లో మాట్లాడా. వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నాను. వారు త్వరలోనే కోలుకుంటారని భావిస్తున్న తరుణంలో ఈ వార్త వినాల్సిరావడం విచారకరం.…
ఏపీ రాజకీయాను ఒక్కసారిగా భగ్గుమనిపించిన అసెంబ్లీ ఘటనపై స్పీకర్ తమ్మనేని సీతారాం స్పందించారు. ఘటనపై ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో జరిగిన దానికి నేను ప్రత్యక్ష సాక్షినని అన్నారు. ఆ రోజు ఏం జరిగిందో నాకు తెలుసునని ఆయన వెల్లడించారు. పత్రిపక్షాల ఆరోపణల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా సభలో రికార్డులను కూడా పరిశీలించామని ఆయన తెలిపారు. సభ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత సభ్యులందరిపైన ఉందని ఆయన హితవు పలికారు. సభను పక్కదారి పట్టించేందుకు తన…
వరదల్లో ప్రభుత్వ వైఫల్యంపై న్యాయ విచారణ చేయాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ సీఎస్ సమీర్ శర్మకు లేఖ రాసారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం రూ. 6054 కోట్ల నష్టం వాటిల్లితే.. కేవలం రూ. 35 కోట్ల నిధులను మాత్రమే విడుదల చేయడం సరైవ పద్దతి కాదని, ప్రకృతి వైపరీత్యాల కోసం ఖర్చు పెట్టాల్సిన రూ. 1100 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిందని కాగ్ తప్పు పట్టిందన్నారు. జాతీయ ప్రకృతి విపత్తుల నిర్వహాణ నిబంధనలకు విరుద్దంగా…
ఏపీలో సంభవించిన వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని పార్లమెంట్ లో డిమాండ్ చేయాలని నిర్ణయించింది టీడీపీపీ… పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది.. వర్చువల్ గా జరిగిన ఈ సమావేశం ద్వారా పార్టీ ఎంపీలకు పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు చంద్రబాబు… Read Also: ఏపీ మూడు రాజధానుల కేసు.. హైకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ వరద సాయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం, జ్యుడీషియల్ విచారణకి డిమాండ్ చేయాలని టీడీపీ భావిస్తోంది..…
ఏపీలో టీడీపీ మళ్లీ పుంజుకోవాలంటే ప్రజల్లోకి వెళ్లాలని ఇప్పటికే ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ విషయాన్ని ఆయన కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. ప్రజాక్షేత్రంలోనే తాడో పేడో తేల్చుకుంటామని ఆ సమయంలో చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు భవిష్యత్ కార్యాచరణను రూపొందించినట్లు తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచి అటు చంద్రబాబు, ఇటు లోకేష్ జిల్లాలలో విస్తృతంగా పర్యటించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై శుక్రవారం…
ఏపీ అసెంబ్లీలో తనపై చేసిన వ్యాఖ్యలకు నారా భువనేశ్వరి స్పందించారు. ఈ వ్యాఖ్యల పై ప్రెస్ నోట్ విడుదల చేసారు. అందులో… ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నాపై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేసిన వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. నాకు జరిగిన అవమానాన్ని మీ తల్లికి, తోబుట్టువుకు, కూతురికి జరిగినట్టుగా భావించి నాకు అండగా నిలబడటం నా జీవితంలో మర్చిపోలేను అన్నారు. చిన్నతనం నుంచి అమ్మ, నాన్న మమ్మల్ని విలువలతో ఉంటారు. నేటికీ మేము…
ఏడో రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. సభ ముందుకు రానుంది కాగ్ నివేదిక. మరోవైపు అసెంబ్లీలో సభ్యుల ఫోన్ల అనుమతికి చెక్ చెప్పారు. సభలో సభ్యులు ఫోన్లు తీసుకుని రావడానికి ఇక నుంచి అనుమతి లేదని హౌస్ లో ప్రకటించారు స్పీకర్ తమ్మినేని. చంద్రబాబు ఎపిసోడ్ సమయంలో టీడీపీ సభ్యులు సభలో వీడియో రికార్డు చేయడం వివాదాస్పదమైన నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నారు.
ముఖ్యమంత్రి అయ్యేవరకూ అసెంబ్లీకి రాను అంటూ శాసనసభ నుండి వాకౌట్ చేసి వెళ్లిపోయారు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు.. అయితే, దీనిపై అధికార పార్టీ నేతలు సెటైర్లు వేస్తూనే ఉన్నారు.. తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి.. కుప్పం ఓటమిని డైవర్ట్ చేయడం కోసమే అయన అసెంబ్లీ నుంచి పారిపోయాడని ఎద్దేవా చేశారు.. వ్యక్తిత్వం ఇప్పటికే దిగజార్చుకున్న చంద్రబాబు ఇప్పటికైనా మారాలని సూచించిన ఆయన.. భారీ వర్షాలు, వరదలతో జరిగిన…