ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబుకి రాసిన లేఖలో ముద్రగడ అనేక విషయాలు ప్రస్తావించారు. తన సతీమణికి అవమానం జరిగిందని చంద్రబాబు కన్నీళ్లు కార్చడం ఆశ్చర్యం కలిగించింది. నాడు మా కుటుంబానికి చేసిన అవమానానికి ఆత్మహత్య చేసుకోవాల్సింది. మీ పతనం నా కళ్లతో చూడాలనే ఆత్మహత్య విరమించుకున్నాను. కాపులకు చంద్రబాబు ఇచ్చిన హామీ కోసం నాడు దీక్ష ప్రారంభిస్తే అవమానించారు. ఇంటి తలుపులు బద్దలుకొట్టి…
భారీ వర్షాలతో ఏపీ అతలాకుతలమైంది. మునెపెన్నడూ చూడని విధంగా ఏపీలో వరదలు పోటెత్తాయి. వరద ప్రభావంతో గ్రామాలు జలదిగ్బంధంలో ఇరుకున్నాయి. లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. వేలాదిగా పశువులు వరదల్లో కొట్టుకుపోయాయి. చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, కడప జిల్లాల్లోని ప్రజలు భారీ వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరడంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తిరుపతిలో కనివిని ఎరుగని రీతిలో భారీ వర్షాలు సంభవించాయి. అయితే సీఎం జగన్…
ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు పలువురు ప్రముఖులు సానుభూతి తెలుపుతున్నారు. ఇప్పటికే చంద్రబాబుకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఫోన్ చేసి మద్దతు తెలపగా… తాజాగా హెల్పింగ్ స్టార్ సోనూ సూద్ కూడా టీడీపీ అధినేతకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇటీవల అసెంబ్లీలో జరిగిన ఘటన గురించి మాట్లాడారు. శాసనసభలో జరిగిన ఘటన దురదృష్టకరమని సోనూసూద్ వ్యాఖ్యానించాడు. దేవాలయం లాంటి సభలో వైసీపీ నేతల వైఖరి సరికాదని సోనూసూద్ అభిప్రాయపడ్డాడు. హైదరాబాద్…
టీడీపీ అధినేత చంద్రబాబు ఈనెల 23 (మంగళవారం) నుంచి ఏపీలోని వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం కడప, మధ్యాహ్నం తిరుపతిలో చంద్రబాబు పర్యటించనున్నారు. బుధవారం నెల్లూరులో ఆయన పర్యటిస్తారు. భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రజలను ఆయన పరామర్శించనున్నారు. ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులపై శనివారం నాడు టీడీపీ నేతలతో చంద్రబాబు సమీక్షించారు. Read Also: వరద బాధిత కుటుంబాలకు జగన్ శుభవార్త రాయలసీమ, నెల్లూరు జిల్లాలో వరదల వల్ల నష్టపోయిన…
గంభీరంగా ఉండే చంద్రబాబు అంతలా వెక్కి వెక్కి ఏడ్వడానికి కారణమేంటి? తాను వేసే ప్రతి అడుగునూ కార్యకర్తలు గమనిస్తారని తెలిసినా.. ఆ స్థాయిలో విలపించడం వెనకున్న రీజనేంటి..? గట్టిగా పోరాడాలని కార్యకర్తలకు నూరిపోసే చంద్రబాబు ఎందుకు డీలా పడ్డారు..? టీడీఎల్పీ భేటీలో.. మీడియా ఎదుట భావోద్వేగాలను ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోయారనేది పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టీడీఎల్పీలో ఓ ఫోన్ వచ్చాక బాబు కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయా? ఏపీ అసెంబ్లీలో అనూహ్య పరిణామాల తర్వాత ఎన్నడూ లేని…
అసెంబ్లీ ఎపిసోడ్ పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి మరోసారి స్పందించారు. అసెంబ్లీ అనేది చట్టాలు చేసే పవిత్రమైన స్థలమని… అసెంబ్లీలో భాష ఏ మేరకు దిగజారిందో ప్రజలంతా చూస్తున్నారని ఫైర్ అయ్యారు. సభ లో భిన్నమైన వాతావరణం ఉంది.. ప్రజా సమస్యలపై కాకుండా వేరే రకమైన చర్చ జరుగుతోంది.. ఇది చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు పురంధేశ్వరి. ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని… విభజన చట్డంలోని 90 శాతం అంశాలు పూర్తయ్యాయని…
ఏపీ అసెంబ్లీ ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, నందమూరి అభిమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాకినాడ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి చంద్రబాబుపై పలు వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ లో జరిగింది నాటకంతో కూడినటువంటి వ్యవహారమని, అసెంబ్లీలో జరిగింది వేరు బయట జరుగుతున్న ప్రచారం వేరని ఆయన అన్నారు. భువనేశ్వరిని ఎవరు ఏమి అనలేదని, చంద్రబాబు ఎక్కువ ప్రచారం చేసుకుంటున్నారన్నారు. చంద్రబాబు తన సతీమణిని అనవసరంగా రాజకీయాల్లోకి లాగుతున్నారని, హెరాయిన్ కేసు లో నా…
ఏపీలో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అయితే… ఈ ప్రళయంలోనూ ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. చంద్రబాబు కంటతడితో.. ఏపీ రాజకీయాలు భగ్గుమన్నాయి. చంద్రబాబు కుటుంబ సభ్యులపై వ్యక్తిగత ఆరోపణల ఎపిసోడ్లో.. టీడీపీ-వైసీపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. మరోవైపు రంగంలోకి దిగిన నందమూరి, నారా కుటుంబ సభ్యులు.. వైసీపీ నేతల వ్యక్తిగత ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. రాజకీయాలతో సంబంధం లేని మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు క్షమించరానిదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో తన కుటుంబాన్ని…
మొన్న జరిగిన ఏపీ అసెంబ్లీ ఘటనతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. తనను వైసీపీ నేతలు వ్యక్తిగతంగా దూషించారని, ఇక ముఖ్యమంత్రి హోదాలోనే అసెంబ్లీలో అడుగుపెడతా అంటూ చంద్రబాబు శపథం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తనను రెండున్నర ఏళ్లుగా అనేక రకాలు దూషించారని కానీ ఈ రోజు నా సతీమణిని కూడా దూషించారంటూ మీడియా ముందే కన్నీటి పర్యంతమయ్యారు. దీనిపై యావత్తు టీడీపీ, నందమూర అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న నందమూరి కుటుంబ…
ప్రజాస్వామ్యంలో చట్ట సభలే దేవాలయాలు. ఒకప్పుడు వాటి పట్ల ప్రజలకు ఎంతో గౌరవం. కాని నేడు చట్ట సభల సమావేశాల తీరు మారింది. ప్రతిష్ట మసకబారింది. గౌరవ సభలు కాస్తా కౌరవ సభలు అవుతున్నాయి. చట్టసభల్లో మటలు హద్దులు హద్దులు దాటుతున్నాయి. హూందాగా సాగాల్సిన సమావేశాలు జుగుప్సాకర స్థాయికి దిగజారాయి. రాజకీయాలతో సంబంధం లేని వారిని, కుటుంబ సభ్యులను ఈ రొచ్చులోకి లాగి సమావేశాలంటేనే వెగటుపుట్టేలా చేస్తున్నారు. వారు వీరు అని లేదు. ఎవరు అధికారంలో ఉన్నా…