భారీ వర్షాలతో మునుపెన్నడూ చూడనివిధంగా ఏపీలో వరదలు పోటేత్తాయి. భారీ వరదలో అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది. దీంతో విపక్షాలతో పాటు కేంద మంత్రులు సైతం వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయిందని ఆరోపణలు చేశారు. దీంతో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విపక్షాలకు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబును ఉద్దేశించి మంత్రి అనిల్ మాట్లాడుతూ.. నీ ప్రచారం పిచ్చి వల్ల పుష్కరాల్లో చనిపోయిన కుటుంబాలకు ఎంత నష్టపరిహారం ఇచ్చావ్? అని ప్రశ్నించారు.
రాయల్ చెరువు తెగి ఉంటే శవ రాజకీయాలు చేసి ఉండేవాడినని చంద్రబాబు బాధపడుతున్నాడని.. ఇంకో స్పిల్ వే కట్టాలని నివేదిక ఇచ్చినా చంద్రబాబు తన హయాంలో ఎందుకు పట్టించుకోలేదని, అప్పుడు నీళ్ళు కూడా లేవు కదా అనిల్ ఉద్ఘాటించారు. ఈ విపత్తుకు చంద్రబాబే కారణమని, రాయలసీమ, నెల్లూరు ప్రాంత ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా కేంద్ర మంత్రి షెకావత్ కు ఏం రాజకీయ అవసరాలు ఉన్నాయో అందుకే వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారంటూ కేంద్ర మంత్రికి చురకలు అంటించారు.