Chandrababu: సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ.. దిశా చట్టం అమల్లో ఉందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యాచారం ఘటన కలకలం సృష్టిస్తోంది.. బాధితురాలిని పరామర్శించడానికి వెళ్లిన సమయంలో.. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడం రచ్చగా మారింది. ఇక, ఇవాళ సీఎం వైఎస్ జగన్‌కు లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు.. రాష్ట్రంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు, మహిళలకు రక్షణలో ప్రభుత్వ వైఫల్యాలను లేఖలో పేర్కొన్నారు.. రాష్ట్రంలో ప్రతిరోజూ ఏదోకచోట మహిళలపై దాడులు, అత్యాచార ఘటనలు జరగడం ఎంతో బాధిస్తోందని ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు.. మహిళల పట్ల హింస, అత్యాచారాల ఘటనలు పెరగడానికి ప్రభుత్వ ఉదాసీన వైఖరే కారణం అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయి.. విజయవాడ ఆస్పత్రిలో గ్యాంగ్ రేప్ ఘటనే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం అని పేర్కొన్నారు చంద్రబాబు.
Read Also: RK Roja: చంద్రబాబు ఒక ఉన్మాది.. ఈ రాష్ట్రానికి ఆయన అవసరం లేదు..!
Also Read
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
- Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
కూతురు కనిపించడంలేదని స్వయంగా పోలీస్ స్టేషన్‌కెళ్లి బాధితురాలి తల్లిదండ్రలు ఫిర్యాదు చేసినా పోలసులు పట్టించుకోకపోవడం అమానుషం అని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు.. విజయవాడలో బాధితురాలిని మేం పరామర్శించాకే ప్రభుత్వంలో చలనం వచ్చిందన్న ఆయన.. అత్యాచారం ఎప్పుడు జరిగిందో..? ఎక్కడ జరిగిందో..? కూడా హోంమంత్రికి తెలియకపోవడం బాధ్యతారాహిత్యాన్ని తెలియజేస్తోందని దుయ్యబట్టారు. జాతీయ క్రైమ్ బ్యూరో నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా మహిళలపై జరిగే నేరాల్లో 3వ వంతు రాష్ట్రంలోనే జరుగుతుండటం అవమానకరం… మహిళలపై జరుగుతున్న భౌతికదాడులు, మానవ అక్రమ రవాణా, లైంగిక వేధింపుల ఘటనల్లో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉండటం గర్హనీయం అని లేఖలో పేర్కొన్న ఆయన.. దిశా చట్టం ప్రకారం 21 రోజుల్లో నిందితులకు శిక్ష వేస్తామని మీరు చేసిన వాగ్దానం ఏమైంది..? రాష్ట్రంలో దిశా చట్టం అమల్లో ఉందా? ఎన్ని కేసులను నమోదు చేశారు? ఎంత మందిని శిక్షించారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
ఇక, ముఖ్యమంత్రి ఇంటి పక్కనే సీతానగరంలో యువతిని గ్యాంగ్ రేప్ చేస్తే నిందితుడు వెంకటరెడ్డిని నేటికీ పట్టుకోలేదని లేఖలో వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు చంద్రబాబు.. గంజాయి, డ్రగ్స్, మద్యం వంటి మాదక ద్రవ్యాలు రాష్ట్రంలో విచ్చలవిడిగా వినియోగించడం వల్లే ఇలాంటి నేరాలు నిత్యకృత్యమయ్యాయన్న ఆయన.. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ చర్యలు, ప్రభుత్వ విధానాలు మహిళలపై నేరాలకు పాల్పడే దుర్మార్గులకు ప్రాణభయం కలిగించే విధంగా ఉండాలని సూచించారు.. రాజకీయ ప్రయోజనాల కోసం పోలీస్ వ్యవస్థను వాడటం మాని శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం ఉపయోగించండి అని సలహా ఇచ్చారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో అత్యాచారానికి గురైన బాధిత యువతికి కోటి రూపాయల ఆర్థిక సాయంతో పాటు, ఇల్లు, జీవనోపాధి కల్పించాలని.. ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి దోషులను కఠినంగా శిక్షించాలని లేఖలో డిమాండ్ చేశారు చంద్రబాబు నాయుడు.
తాజావార్తలు
-
WhatsApp Scam Alert: వాట్సాప్‌లో ‘YES’ లేదా ‘NO’ అని పంపితే డబ్బులు మాయం.?
-
Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
-
EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
-
Karthik Subbaraj : శిష్యుడు దర్శకుడవుతుంటే గర్వంగా ఉంది.. కార్తీక్ సుబ్బరాజ్ ఎమోషనల్ కామెంట్స్!
-
AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!