పోలవరం ప్రాజెక్ట్ పై మంత్రి అంబటి రాంబాబు సరైన సమాధానం చెప్పడం లేదని, చెప్పేదంతా తప్పుల తడకగా ఉందన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. డయా ఫ్రమ్ వాల్ ను చంద్రబాబు కడితే దానిని ఏమి చేయాలో తెలియక అయోమయ పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం ఉంది. ప్రాజెక్ట్ పై ఎందుకు నిపుణులతో పరిశీలన చేయడం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మీరు ఒక కాంట్రాక్టర్ ను పెట్టుకున్నారు. గతంలో ప్రభుత్వం ఒక కాంట్రాక్టర్ ను పెట్టుకుంది.…
ఏపీలో ఇంకా ఎన్నికలు టైం వుంది. కానీ ప్రధాన ప్రతిపక్షం మాత్రం ముందస్తు ముహూర్తాలు పెట్టేస్తోంది. వైసీపీ నేతలు కూడా ముందస్తు మాట ఎత్తకుండానే ఎన్నికల కోసం సమాయత్తం అవుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. 2024 కి కంటే ముందు ఎన్నికలు జరిగినా. జరగకపోయినా ఏపీలో మాత్రం పొత్తులు వుంటాయనేది జగమెరిగిన సత్యం. బీజేపీ-జనసేన కలిసి నడుస్తాయని బీజేపీ నేతలే ఎక్కువగా ప్రకటిస్తున్నారు. తాజాగా అమరావతిలో జనసేనాని పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన-బీజేపీ…
జగన్ సర్కార్ 3 ఏళ్ల రివర్స్ పాలనతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి పోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. బిల్లుల కోసం కాంట్రాక్టర్ కోర్టుకు వెళ్లకూడదు అని టెండర్‌లో నిబంధన పెట్టడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ చర్య రాష్ట్ర పరువు తీసేలా ఉంది.. దీనికి సీఎం జగన్ సిగ్గుపడాలి అంటూ ఆయన ధ్వజమెత్తారు. కాంట్రాక్టర్లను బిల్లుల కోసం కోర్టుకు వెళ్లవద్దని టెండర్ డాక్యుమెంట్ లోనే నిబంధన పెట్టడం రాష్ట్ర దుస్థితికి, అసమర్థ పాలనకు…
ఏలూరు జిల్లా దెందులూరు మండలం సత్యనారాయణపురం గ్రామం వద్ద గల ఏలూరు కెనాల్ ను మంత్రి అంబటి రాంబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఎకరానికి సాగు నీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్ట్ పనులను అవగాహన లేకుండా చేపట్టారని ఆయన ఆరోపించారు. ముందు చూపు లేకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టడం చారిత్రక తప్పిదమని ఆయన మండిపడ్డారు. తప్పు ఎవరి…
సీఎం జగన్ లాభాపేక్షకు విద్యారంగం నాశనమైందని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు కేఎస్ జవహర్ ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీచర్లను లిక్కర్ షాపుల వద్ద నిలబెట్టినప్పుడే విద్యారంగంపై జగన్ చిత్తశుద్ధేమిటో అర్థమైందని ఆయన మండిపడ్డారు. నూతన విద్యావిధానం అంటూ ఎవరిని సంప్రదించి సీఎం నిర్ణయాలు తీసుకున్నారు..? అని ఆయన ప్రశ్నించారు. మంత్రులంతా వేలి ముద్రగాళ్లు అవ్వబట్టే, రాష్ట్రంలో విద్య వ్యాపారాంశమైందని, చంద్రబాబు బడ్జెట్లో 15శాతం నిధులు విద్యకు కేటాయిస్తే, జగన్ వచ్చాక 10శాతం…
రాజధాని నిర్మాణంపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తొలి సంతకం రాజధాని నిర్మాణ పనులపైనే అంటూ స్పషీకరించారు. అంతేకాకుండా.. రాజధాని నిర్మాణం మూడేళ్లల్లో పూర్తి చేస్తామని, అధికారంలోకి వస్తే రాజధాని పనుల మీదే బిజెపీ మొదటి సంతకం చేస్తుందని ఆయన వెల్లడించారు. ఒకాయన ఎక్కడికెళ్లినా ఆ మోడల్ కేపిటల్ కడతానంటారు.. మాట తప్పను మడమ తిప్పను అంటూ రాజధానిని విశాఖకు తీసుకెళ్తానంటాడు ఇంకొకాయన.. బీజేపీ అమరావతిలోనే…
మహానాడు తర్వాత పార్టీ పటిష్టత, గ్రూప్ రాజకీయాలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫోకస్ చేశారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వకర్తలతో వరుస సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. సొంత జిల్లా చిత్తూరు నుంచే చంద్రబాబు సమీక్షలు ప్రారంభించారు. ఈ మేరకు చిత్తూరు, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్త బీద రవిచంద్ర యాదవ్‌తో చర్చించారు. CM Jagan: వైసీపీ నుంచి కొత్తపల్లి సుబ్బారాయుడు సస్పెన్షన్ చిత్తూరు, తిరుపతి పార్లమెంటుల పరిధిలోని నేతల పని తీరుపై చంద్రబాబుకు బీదా రవిచంద్ర…
అమరావతి: ప్రతిపక్ష పార్టీ టీడీపీపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. మహానాడు నుంచి టీడీపీ నేతలకు కడుపు మంట ఎక్కువైందని ఆయన ఎద్దేవా చేశారు. మహానాడు ఘన విజయం అంటూ వాళ్ళకి వాళ్లే బుజాలు చరుచుకుంటున్నారని చురకలు అంటించారు. టీడీపీ నేతలు ఎంతటి పతనావస్థలో ఉన్నారనేది వారి ఏడుపు వల్లే కనిపిస్తోందని సజ్జల ఆరోపించారు. ఏడుపు వాళ్ళ అధికారిక గీతం అయ్యిందని.. అసెంబ్లీ నుంచి చంద్రబాబు ఏడుపు ప్రారంభమైందని…
అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మాజీ సీఎం చంద్రబాబును గ్రూప్-1 అభ్యర్థులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రూప్-1 నియామకాల్లో తమకు అన్యాయం జరిగిందని పలువురు అభ్యర్థులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం అభ్యర్థులు మాట్లాడుతూ.. 2018 గ్రూప్-1 పరీక్షా ఫలితాల్లో అనేక అవకతవకలు జరిగాయని.. ఏపీపీఎస్సీ వ్యవహారం అనుమానాస్పదంగా ఉందని ఆరోపించారు. డిజిటల్, మాన్యువల్ వాల్యుయేషన్‌లో 62శాతం వ్యత్యాసం ఉందన్నారు. డిజిటల్ మూల్యాoకానం, మాన్యువల్ మూల్యాంకనంలో 62 శాతం ఫలితాలు తేడా రావటమే…