Jogi Ramesh: నూతన సంవత్సరం సందర్భంగా గుంటూరులో జరిగిన ఘటనపై మంత్రి జోగి రమేష్ విమర్శలు చేశారు. చంద్రన్న కానుక పేరుతో కూపన్లు ఇచ్చి పేదలను ఒకచోటకు చేర్చారని.. కిట్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారని తెలిపారు. టీడీపీ నేతలు ఎన్ని కూపన్లు ఇచ్చారు.. ఎంతమందికి పంచారో చెప్పాలన్నారు. సంక్రాంతి పేరు చెప్పి నూతన సంవత్సరంలో పేదల ప్రాణాలు బలితీసుకున్నారని జోగి రమేష్ మండిపడ్డారు. పేదల ప్రాణాలంటే చంద్రబాబుకు చులకన చూపు అని.. చంద్రబాబును నమ్ముకుంటే నట్టేట…
Budda Venkanna: మాజీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడాలి నానికి టిక్కెట్ ఇచ్చి చంద్రబాబు చారిత్రాత్మకమైన తప్పు చేశారని.. చంద్రబాబు యాత్రను తప్పు పట్టే స్ధాయి కొడాలి నానిది కాదన్నారు. రాష్ట్రాన్ని బాగు చేయాలంటే చంద్రబాబు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని.. రాష్ట్రానికి శని ఎవరో డిబేట్కు తాను రెడీ అని.. కొడాలి నాని వస్తే ప్రజల్లో తేల్చుకుంటామన్నారు. గుడివాడలో ఓడిపోతామనే కొడాలి నాని ఫ్రస్ట్రేషన్లో…
Minister Roja: గుంటూరులో ఉయ్యూరు ఫౌండేషన్ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగిన ఘటనపై మంత్రి రోజా స్పందించారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి అమాయకులు బలవుతున్నారని ఆమె ఆరోపించారు. ఇరుకు రోడ్లపై సభలు పెట్టి జనాలను చంపేస్తున్నారని.. పేదవాళ్ల ప్రాణాలంటే చంద్రబాబుకు అంత చులకనా అంటూ విమర్శలు చేశారు. గతంలో గోదావరి పుష్కరాల సమయంలోనూ 29 మందిని పొట్టనబెట్టుకున్నారని.. ఇప్పుడు మరో 11 మంది బలయ్యారని రోజా అన్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ కాబట్టి 40 మందిని చంపేశారని ఆగ్రహం…
కందుకూరులో ఎనిమిది మంది మృతిచెందిన ఘటన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు మరింత పెరిగాయి.. ఇప్పుడు గుంటూరులో కూడా మరో ముగ్గురు ప్రాణాలు విడవడంతో.. మరోసారి అధికార పార్టీ నేతలకు టార్గెట్ అయ్యారు చంద్రబాబు నాయుడు.. కృష్ణా జిల్లా గుడివాడలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కొడాలి నాని.. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.. యమ రథంతో చంద్రబాబు ప్రజలను చంపుతున్నాడని విమర్శించారు. ఏడాది చివర ఎనిమిది మందిని, ప్రారంభంలో ముగ్గురిని బలుగొన్న నరరూప రాక్షసుడు…
Jogi Ramesh: చంద్రబాబు అధికార దాహం, ప్రచార పిచ్చి వల్లే అమాయక ప్రజల మరణాలు సంభవిస్తున్నాయని విమర్శించారు ఆంధ్రప్రదేశ్ మంత్రి జోగి రమేష్.. చంద్రబాబు 40 ఏళ్ల ఇండస్ట్రీలో 40 మందిని పొట్టన పెట్టుకున్నాడని మండిపడ్డారు.. ఇంత మంది మరణాలకు కారణం అయిన చంద్రబాబుపై అసలు ఎందుకు చర్యలు తీసుకోకూడదు? అని నిలదీశారు.. గుంటూరులో తొక్కిసలాట ఘటనపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన మంత్రి జోగి రమేష్.. చంద్రబాబును అరెస్టు చేస్తామని ప్రకటించారు. ఇక, చంద్రబాబు డైరెక్షన్లోనే ఉయ్యూరు…
గుంటూరులో తొక్కిసలాటపై టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. చంద్రబాబు మాకు ఇదేమీ ఖర్మ..? అని ప్రశ్నించిన ఆయన.. కందుకూరులో మీటింగ్ పెట్టినప్పుడే చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చా.. అయినా ఒక్క శాతం కూడా మారలేదు అని మండిపడ్డారు. అసలు డీజీపీకి బుద్ది ఉండొద్దా…? అనుమతులు ఎలా ఇస్తారు..? అని నిలదీశారు.. పది వేల మందికి అనుమతి తీసుకుని నలభై యాభై వేల మందిని తరలించారని ఆరోపించారు.. అసలు, చట్ట…
Guntur Stampede: టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్న మరో కార్యక్రమంలోనూ ప్రాణ నష్టం జరిగింది.. గత నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు నిర్వహించిన సభలో కొందరు కార్యకర్తలు, అభిమానులు మురుగునీటి కాల్వలో పడిపోవడంతో అపశృతి చోటుచేసుకుంది. ఐదుగురు కార్యకర్తలు అక్కడికక్కడే చనిపోగా, మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ మరో ముగ్గురు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 8కు చేరిన తెలిసిందే కాగా.. తాజాగా, గుంటూరులో అదే సీన్ రిపీట్ అయ్యింది. గుంటూరులో టీడీపీ…