Minister Kottu Satyanarayana: తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేతపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ.. తాజా పరిణామాలపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. టీడీపీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని వ్యాఖ్యానించారు. ఇక, ఉనికి కోసమే టీడీపీ ఆరాటం.. తమ పార్టీ బతికే ఉందని చెప్పుకునే ప్రయత్నం చేస్తుందని ఎద్దేవా చేశారు.. పార్టీ అధ్యక్షుడే పార్టీ లేదూ బొక్కా లేదూ అనటం అంటే ఆ పార్టీ లేనట్లే కదా..? అని సెటైర్లు వేశారు. ప్రజాస్వామ్యం…
Social Media: ప్రస్తుతం రాజకీయ పార్టీ కార్యక్రమాలకు అయినా, సినిమా ప్రమోషన్లకు అయినా, వ్యాపారానికి సంబంధించిన ప్రమోషన్లకు అయినా సోషల్ మీడియా ప్రధానంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఫాలోవర్ల విషయం కూడా ఆసక్తిరేపుతోంది. ఈ అంశంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలు ఒకరితో ఒకరు పోటీ పడి ఫాలోవర్లను పెంచుకోవడంపై దృష్టి సారిస్తున్నారు. సోషల్ మీడియాకు సంబంధించి రాజకీయ నేతలు ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లను వాడుతున్నప్పటికీ ఎక్కువ ఫోకస్ మాత్రం ట్విటర్పైనే పెడుతున్నారు. ఏపీకి సంబంధించి…
Christamas: ఆదివారం క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఏపీ ప్రజలకు సీఎం జగన్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. కరుణ, ప్రేమ, దాతృత్వం, త్యాగం వంటి వాటిని క్రీస్తు తన జీవితం ద్వారా మానవాళికి అందించించిన గొప్ప సందేశాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు కరుణామయుడి ఆశీస్సులు, దీవెనలు లభించాలని జగన్ ఆకాంక్షించారు. మరోవైపు ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, కరుణ, సేవలతో కూడిన శాంతియుత జీవన మార్గాన్ని ఏసు ఈ ప్రపంచానికి అందించారని…
Botsa Satyanarayana: టీడీపీ అధినేత చంద్రబాబుపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. పార్టీని నిలబెట్టుకోవడానికి చంద్రబాబు తెగ తాపత్రయ పడుతున్నాడని ఆయన ఆరోపించారు. ఆయనకు జవసత్వాలు అయిపోయాయని.. అందుకే వాటిని నిలుపుకోవడానికి పర్యటనలు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. నిర్మాణాత్మకమైన అంశాలు చెబితే ప్రజలు దాని గురించి ఆలోచిస్తారని.. కానీ అసత్యాలు చెప్తే నమ్మరనే సంగతి గుర్తుపెట్టుకోవాలన్నారు. రాజాం, బొబ్బిలి సభలలో చంద్రబాబు అన్నీ అసత్యాలే చెప్పారని మంత్రి బొత్స మండిపడ్డారు. బొబ్బిలి రైతు…