Margani Bharat: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై హాట్ కామెంట్లు చేశారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌రామ్.. అసలు పవన్.. టీడీపీ అధినేత చంద్రబాబు అజెండా మోసుకుని ఢిల్లీ పెద్దల దగ్గరికి వెళ్ళాడా..? లేదా వాళ్లే పిలిచారా..? అనే విషయం తెలియాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరిలో విశ్వసనీయత అనేది లేదని విమర్శించిన ఆయన.. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ మాధవ్‌ను మిత్రపక్షంగా గెలిపించే ప్రయత్నం కూడా జనసేన చేయకపోవటం విచిత్రమని వ్యాఖ్యానించారు.. ఇదెక్కడ పొత్తని…
ఎంతసేపు సీఎం జగన్ పై నిందలు, విమర్శలు చేయడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో ఉత్తరాంధ్రలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం అయినా జరిగిందా అంటూ ఆయన ప్రశ్నించారు. ఎవరి పనైపోయిందో వచ్చే ఎన్నికలే చెబుతాయన్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లాలోని కార్వేటినగరం పెద్ద దళితవాడ గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
రానున్న 2024 ఎన్నిలకల్లో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం కావడం ఖాయం అన్నారు మంత్రి గుమ్మనూరు జయరాం.. కర్నూలు జిల్లా ఆలూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు అని జోస్యం చెప్పారు.. 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి ఏమి చేశాడు అని చెప్పలేడు అంటూ ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ ఏమి చేశాడో చెబుతాడు.. తప్ప ఆయన ఏమి చేసింది చెప్పులేని వ్యక్తి చంద్రబాబు అంటూ సెటైర్లు వేశారు.. ఇక,…
Vallabhaneni Vamsi: తాడేపల్లి క్యాంప్ కార్యాలయం వేదికగా మంత్రులు, ఎమ్మెల్యేలు, రీజనల్ కో-ఆర్డినేటర్లు, నేతలతో సమావేశమైన ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్.. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. మరోసారి మనం అధికారంలోకి రాకపోతే ప్రజలు తీవ్రంగా నష్టపోతారని.. అంతా కలిసికట్టుగా పనిచేస్తే.. అను లక్ష్యాన్ని చేరుకుంటామని తెలిపారు.. ఇక, ఏ ఒక్క ఎమ్మెల్యేను గానీ, ఏ ఒక్క కార్యకర్తను గానీ నేను వదులుకోవడానికి తాను సిద్ధంగా లేనని స్పష్టం చేశారు..…