ఎన్టీఆర్ జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఈ రోజు నుండి జగన్ననే మా భవిష్యత్తు కార్యక్రమం ఏపీ వ్యాప్తంగా ప్రారంభమవుతుంది..ఏడు లక్షల మంది పార్టీ సైనికులు 1.65 లక్షల మందిని కలిసి ప్రజాసేకరణ చేయనున్నారు..గతంలో ఏ పార్టీ ఈ విధముగా చేయలేదు .. ఇప్పటికే గడప గడపకు కార్యక్రమం చేపట్టి లబ్దిదారుల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నాం..జగన్ననే మా భవిష్యత్తు లో ప్రజల నుండి గత ప్రభుత్వ పాలనా ఇప్పుడు మా పాలన కు సంబంధించి వారి అభిప్రాయం తెలుసుకునే కార్యక్రమం..ఐదు అంశాలపై ప్రజల నుండి అభిప్రాయం సేకరించి వారు ఈ ప్రభుత్వంపై విశ్వాసం చూపితే వారి ఇంటికి వారి అనుమతితో మా నమ్మకం నువ్వే జగన్ స్టిక్కర్ ను వారి ఇంటికి అంటిస్తారు..
గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీ లు ఏర్పాటు చేసి ఏ విధంగా పరిపాలన అందించారో మనం చూసాం..మా ముఖ్యమంత్రి లబ్దిదారుడికి అర్హత ఉంటే చాలు వారికి నేరుగా పధకాలు అందజేయని చెప్పారు..అమరావతి పేరుతో విజయవాడ నగరాన్ని మోసం చేసారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు..2019 తర్వాత నగరంలో అభివృద్ధికి కోట్ల రుపాయలు కేటాయించి రోడ్లు, డ్రైయిన్ లు, పార్కు లు అభివృద్ధి చేశాం..గత ప్రభుత్వంలో విజయవాడ అభివృద్ధికి 450 కోట్ల రుపాయలు ఇస్తే అవి వేరే వాటికి మళ్లించి విజయవాడ ప్రజలను మోసగించారు..విజయవాడలో వరదలు వచ్చిన ఎటువంటి ముప్పు రాకుండా రిటైనింగ్ వాల్ నిర్మించాం అన్నారు వెల్లంపల్లి.
Read Also: 7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ బొనాంజా.. మళ్లీ పెరగనున్న డీఏ
వినుకొండ ఎమ్మెల్యే సంచలన కామెంట్లు
వినుకొండ ఎమ్మెల్యే సంచలన కామెంట్లు చేశారు…. రాబోయే రోజుల్లో తన ప్రత్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయాలంటే భయపడేలా ఎన్నికలు చేయబోతున్నానని కార్యకర్తలకు స్పష్టం చేశారు…. తాను ప్రాణాలను లెక్కచేయననీ, ప్రాణాలు పోతాయని భయపడనని ,నన్ను నమ్ముకున్న కార్యకర్తలకు అన్యాయం జరిగితేనే బాధపడతానని బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు…. సమయం వచ్చినప్పుడు తానేంటో చూపిస్తాను అని అంటున్నారు వినుకొండ ఎమ్మెల్యే. బ్రహ్మనాయుడు కామెంట్లు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి.