రానున్న 2024 ఎన్నిలకల్లో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం కావడం ఖాయం అన్నారు మంత్రి గుమ్మనూరు జయరాం.. కర్నూలు జిల్లా ఆలూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు అని జోస్యం చెప్పారు.. 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి ఏమి చేశాడు అని చెప్పలేడు అంటూ ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ ఏమి చేశాడో చెబుతాడు.. తప్ప ఆయన ఏమి చేసింది చెప్పులేని వ్యక్తి చంద్రబాబు అంటూ సెటైర్లు వేశారు.. ఇక, నారా లోకేష్ పాదయాత్రలో ఎటువంటి హామీలు ఇవ్వలేడని విమర్శించారు.. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడం కోసం లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారని ఆరోపించారు.. అయితే, మా నమ్మకం సీఎం జగనే.. మా నమ్మకం నీవే జగనన్న పేరుతో ఈ నెల 7వ తేదీన నుంచి 20వ తేదీ వరుకు కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామ గ్రామన జగనన్న పథకాలు తెలియజేస్తామన్న ఆయన.. రాష్ట్రాన్ని పాలించే అర్హత కేవలం వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి మాత్రమే ఉందన్నారు.. కానీ, రాష్ట్రాన్ని పాలించే అర్హత చంద్రబాబుకు లేదంటూ మండిపడ్డారు మంత్రి గుమ్మనూర్ జయరాం.
Read Also: Rashmika Mandanna : వామ్మో.. రష్మిక 27ఏళ్ల వయసులో అన్ని కోట్లా !
కాగా, జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమం ఈ నెల 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు చేపట్టనున్న విషయం విదితమే.. రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల మందిని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చే యనున్నారు.. గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు, మండల ఇంఛార్జులు, జోనల్ కో-ఆర్డినేటర్లు ఇలా మొత్తం యంత్రాంగాన్ని కదిలించనున్నారు.. ‘మా నమ్మకం నువ్వే జగన్’ అనే భావన ప్రజల నుంచే వచ్చిందని పోస్టర్ విడుదల చేసిన సందర్భంగా వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.. ప్రజల జీవితాల్లో కీలక మార్పు తీసుకుని రావటమే ప్రభుత్వ లక్ష్యంగా తెలిపారు. ప్రతి పేద కుటుంబం.. తన కాళ్ల మీద తాను నిలబడే విధంగా చేయడమే వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కార్ టార్గెట్‌గా వెల్లడించారు. ఒక రాజకీయ పార్టీ ఇంత విస్తృతంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టడం ఇదే మొదటిసారి అని.. 7 లక్షల మంది జగన్ ప్రతినిధులుగా ప్రజల వద్దకు వెళ్తారని తెలిపారు.. గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకుని వచ్చిందో ప్రజలకు వివరిస్తారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 87 శాతం మంది ప్రభుత్వం నుంచి నేరుగా లబ్ధిపొందారని పేర్కొన్నారు సజ్జల.