Sarath Babu: సీనియర్ నటుడు శరత్ బాబు కొద్దిసేపటి క్రితమే మరణించిన విషయం తెల్సిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్సపొందుతూ మృతి చెందారు. శరత్ బాబు మృతి ఇండస్ట్రీకి తీరని లోటు. ఈ విషయం తెలియడంతో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. శరత్ బాబు మృతిపట్ల సినీ ప్రముఖులే కాకుండా రాజకీయ నేతలు కూడా శరత్ బాబు మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా శరత్ బాబు మృతిపై ఏపీ సీఎం జగన్.. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలవాలని ట్విట్టర్ ద్వారా తెలిపారు. “తెలుగు చలనచిత్ర రంగంలో కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, సహాయ నటుడిగా అన్ని రకాల పాత్రలను పోషించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న గొప్ప నటుడు శరత్‌బాబుగారు. నేడు ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళడం బాధాకరం. శరత్‌బాబు గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.” అంటూ జగన్ ట్వీట్ చేశారు.
Vimanam: వేశ్యగా మారిన అనసూయ.. ?
“ప్రముఖ సీనియర్ సినీ నటులు శరత్ బాబుగారి మరణవార్త దిగ్భ్రాంతిని కలిగించింది. వివిధ భాషాచిత్రాల్లో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి దక్షిణాది సినీ పేక్షకులను మెప్పించిన శరత్ బాబు గారి మృతి సినీరంగానికి తీరని లోటు. ఆయన ఆత్మశాంతికై ప్రార్థిస్తూ, ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను” అని చంద్రబాబు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
https://twitter.com/ncbn/status/1660586409130901505?s=20
తెలుగు చలనచిత్ర రంగంలో కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, సహాయ నటుడిగా అన్ని రకాల పాత్రలను పోషించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న గొప్ప నటుడు శరత్‌బాబుగారు. నేడు ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళడం బాధాకరం. శరత్‌బాబు గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. pic.twitter.com/NaTgovOKOW
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 22, 2023