రుణమాఫీ చేస్తానని చెప్పి ఏపీ ప్రజలను చంద్రబాబు మోసం చేశాడు ఇప్పుడు మల్లీ మాయమాటలు చెప్తున్నాడని మంత్రి ధర్మాన ప్రసాద్ రావు అన్నారు. తప్పు చేస్తే మాకు మేము ప్రాయశ్చిత్తం చేసుకుంటాం.. కానీ చంద్రబాబు మాత్రం అలా కాదు అని ఆయన వ్యాఖ్యనించారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్రంగా మండిపడ్డారు. ఒలింపిక్స్ మెడల్ కొట్టి డోపింగ్‌లో దొరికిపోయినట్లయింది చంద్రబాబు పరిస్థితి అని ఆయన పేర్కొన్నారు. ఐటీ నోటీసులపై చంద్రబాబు ఎందుకు మాట్లాడడు అంటూ ఆయన ప్రశ్నించారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సీరియస్ కామెంట్స్ చేశారు. టీడీపీ హయాంలో ఏ ఒక్కరికి అయినా ఇసుక ఉచితంగా ఇచ్చారా అంటూ మంత్రి ప్రశ్నించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతికి ప్యాంట్ షర్ట్ వేస్తే చంద్రబాబు లాగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. చేసిన తప్పులకు శేష జీవితంలో చంద్రబాబు ఫలితం అనుభవించక తప్పదు అని ఆయన విమర్శించారు.