Sajjala: చంద్రబాబు జీవితమంతా అక్రమ మార్గాలే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. చంద్రబాబు జీవితమంతా అక్రమ మార్గాలేనని సజ్జల మండిపడ్డారు. ఈ కుంభకోణానికి రూపకర్త, నిర్మాత, దర్శకత్వం అన్నీ చంద్రబాబేనని ఆరోపించారు. ఈ కేసులో చంద్రబాబుకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలు ఉన్నందునే నిన్న(శనివారం) అరెస్ట్ చేశారని సజ్జల స్పష్టం చేశారు. ఈ కేసు సంవత్సరం కిందే దర్యాప్తు మొదలైందని, తీగ లాగితే డొంక కదిలిందని అన్నారు. మరోవైపు రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా లోకేష్, పవన్ కల్యాణ్ వ్యహరించారని దుయ్యబట్టారు.
Read Also: IND vs PAK Live Updates: మళ్లీ వర్షం.. మ్యాచ్ రిజర్వ్ డేకు వాయిదా
Also Read
- Breast Cancer: తేనెటీగ విషంతో క్యాన్సర్‌కు చెక్ పెట్టొచ్చా? పరిశోధనల్లో ఏం తేలింది?
- AP Government Employees Holiday: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. వరుసగా 4 రోజుల సెలవులు.. ఉత్తర్వులు జారీ
- Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
- Punganur Clashes: పుంగనూరు ఘటనపై మూడు కేసులు నమోదు.. డీఐజీ కీలక వ్యాఖ్యలు
మరోవైపు ఇవాళ చంద్రబాబును రిమాండ్ కు పంపడం అనేది పెద్ద విషయం అని మేం భావించడం లేదని సజ్జల పేర్కొన్నారు. దర్యాప్తు ప్రక్రియలో అదొక భాగమని.. ఇందులో ఆరోపణలు రుజువు చేయాల్సి ఉందని తెలిపారు. ఆధారాలు బలంగా ఉన్నాయి కాబట్టి నేరారోపణ రుజువవుతుందని చెప్పారు. స్కిల్ డెవలప్ మెంట్ సంస్థను చంద్రబాబు పూర్తిగా తన కిందనే పెట్టుకున్నాడని సజ్జల ఆరోపించారు. సీఎస్, ఆర్థిక కార్యదర్శి తదితర అధికారులు కూడా సీఎం చెబితేనే చేశామని స్పష్టంగా చెప్పారని.. ఇంత భారీ కుంభకోణం జరిగిందన్నారు. 40 ఏళ్లుగా చంద్రబాబు ఎన్నో స్కామ్‌లు చేశారని పేర్కొన్నారు. తప్పు చేయకుంటే రూ.కోటి ఇచ్చి లాయర్‌ను ఎందుకు తెచ్చుకున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.
Read Also: Vijayasai Reddy: దేశంలో ఎవరూ చట్టానికి అతీతులు కాదు
ఇదిలా ఉంటే.. నిన్న సొంత కొడుకు కంటే దత్తకొడుకు వీరంగం ఎక్కువైపోయిందని సజ్జల విమర్శించారు. తన ఇంట్లో పడుకున్నట్టు జగ్గయ్యపేట రోడ్డుపై కాలుమీద కాలేసుకుని విలాసంగా పడుకున్నాడని ఆరోపించారు. మరోవైపు చంద్రబాబు నిన్న పెద్ద డ్రామా చేశాడని తెలిపారు. పెద్దాయన, మాజీ ముఖ్యమంత్రి కావడంతో హెలికాప్టర్ ఏర్పాటు చేశామని.. కానీ పబ్లిసిటీ కోసం ఉహూ అన్నాడని తెలిపారు. నిన్న విచారించిన డీఐజీ కూడా మామూలుగానే వ్యవహరించాడని.. అవతలున్నది మాజీ సీఎం కావడంతో ఎందుకులే అనుకుని ఉండొచ్చన్నారు. కానీ ఆయన కొడుకు ఓ సీఐని మాట్లాడింది మామూలు బూతులా? మాజీ సీఎం కొడుకు అని గౌరవిస్తే, వాళ్ల పాలేర్లు అన్నట్టుగా మాట్లాడుతున్నారని అన్నారు. ఎన్ని సమస్యలు వచ్చినా జగన్ ధైర్యంగా నిలబడ్డారని.. జగన్ కు ఇతరులకు చాలా తేడా ఉంది” అంటూ సజ్జల పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Breast Cancer: తేనెటీగ విషంతో క్యాన్సర్‌కు చెక్ పెట్టొచ్చా? పరిశోధనల్లో ఏం తేలింది?
-
Rashmika Mandanna: ‘రణబాలి’ అసలు కథేంటో చెప్పిన రష్మిక మందన్న!
-
AP Government Employees Holiday: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. వరుసగా 4 రోజుల సెలవులు.. ఉత్తర్వులు జారీ
-
India Squad for New Zealand Series: న్యూజిలాండ్‌తో వన్డే, టెస్ట్ సిరీస్‌ల కోసం భారత జట్ల ప్రకటన.. జడేజాకు షాక్!
-
Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!